బెడ్ కాఫీ లేనిదే బెడ్ మీద నుంచి
లేవబుద్ది కాదు. కాఫీ, టీ లకు అంతలా అలవాటు పడిపోయాము. ఎవరైనా ఇంటికి
వచ్చినా కూడా కాఫీ లేదా టీ ఇది మన నాగరికత అయిపొయింది. కాని పొద్దుటే కాఫీ,
టీ లు బదులు రాత్రి మిగిలిన అన్నం లో కొంత మజ్జిగ, ఉప్పు కలిపి ఉంచుకుని
పొద్దుటే అది తింటే చాలా మంచిది. కొందరైతే కావాలనే అన్నాన్ని దీనికోసమే
వండి పాలు పోసి, తోడుకోవడం కోసం కాసింత మజ్జిగో, పెరుగో పడేస్తారు. దీనిలో
కొందరు ఉల్లిపాయ, పర్చిమిర్చి నంచుకుని తింటారు. ఇప్పటి నాజూకైన నాగరికతలో
పొద్దుటే ఇలా అన్నం తినడం అంటే చాల కష్టం, అది తింటే నిద్ర వస్తున్నట్టు
ఉంటుంది ఇలా అంటారు. కాని మన పూర్వీకులు ఇవి తిని బయటకు వెళ్లి మనకంటే
ఎక్కువ కష్టపడి పని చేసేవారు. అసలు చద్దన్నాన్ని పొద్దుటే తింటే కలిగే
లాభాలు తెలిస్తేషాక్ అవుతారు మీరు. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియం,
కాల్షియం వంటి సూక్ష్మపోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట… ఉదాహరణకు
రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే అది
తెల్లారేసరికి 73.91 మిల్లీగ్రాములకు పెరుగుతుందట… బీ6, బీ12 విటమిన్లు
కూడా దండిగా లభిస్తాయి…చద్దన్నం తినడం వలన చల్లదనం కూడా.
అంతే కాకుండా..
- అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి
- శరీరాన్ని చాలా తేలికగా, ఎనర్జిటిక్ గా ఉంచుతుంది
- శరీరాన్ని త్వరగా అలిసిపోనివ్వకుండా, తాజాగా ఉంచుతుంది
- పీచు అధికంగా ఉండటం వలన మలబద్ధకం, నీరసం తగ్గుతాయి
- పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది
- శరీరంలో ఉపయుక్త బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది
- అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగించుతుంది
- బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయ తగ్గుదల ఉంటుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే, పెద్దల
మాట చద్దన్నం మూట అని అంటారు. చద్దన్నం మూటలో అన్ని మంచి చేసే గుణాలు
ఉన్నాయని అర్ధం. పెద్దల కాళ్ళు మొక్కే నాగరికత ఉన్న మనం చద్దన్నాన్ని
కళ్ళకద్దుకుని తిందాము, నలుగురికి చెప్పి తినిపిద్దాము.
No comments:
Post a Comment