హై సెక్యూరిటీ
రిజిస్ర్టేషన్ నంబర్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అంటేనే వాహనదారులు
హడలిపోతున్నారు. నెంబర్‌ప్లేట్ కోసం రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించడం
మొదలుకొని దాన్ని వాహనానికి బిగించుకునే వరకు గంటలు, రోజుల తరబడి వేచి
ఉండాల్సి వస్తోంది. వాహనం రిజిస్ర్టేషన్ అయిన వారం రోజుల్లో దాని
బిగించాల్సి ఉన్నా ఆ సమయానికి అవి తయారు కావడం లేదు. వాటిని
బిగించుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రత్యే కంగా ఆర్టీఏ
కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా వాహనదారులు హై సెక్యూరిటీ
రిజిస్ర్టేషన్ నెంబర్ ప్లేట్‌లతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. 2013
నుంచి కేంద్ర ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్ నంబర్ ప్లేట్
విధానాన్ని అమలు చేసింది. 2013 నుంచి కొత్తగా రిజిస్ర్టేషన్ అయ్యే ప్రతి
వాహనానికి ఈ నెంబ ర్ ప్లేట్‌లు ఉండాలని నిర్ణయించారు. తెలంగాణ రాషా్ట్ర
నికి సంబంధించి లింక్ ఆటో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును
పొందింది. అప్పటి నుంచి ఈ సంస్థే ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ఒక
హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రా న్ని ఏర్పాటు చేసి కొత్త వాహనదారుల నుంచి వారే
స్వయంగా రిజిస్ర్టేషన్ ఫీజులను వసూలు చేయడం, తర్వాత వాటిని తయారు చేసి
బిగించడం వారి బాధ్య త. గ్రేటర్ పరిధిలో ఉన్న 11ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో
ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులే నిత్యకృత్యంగా మారాయి.
నంబర్ ప్లేట్ బిగించుకోవడానికి ఉన్నతాధికారులతో పైరవీ చేయిం చుకోవాల్సిన
పరిస్థితి. ఎన్నో భద్రతా ప్రమాణాలతో రూపొందించిన హైసెక్యూరిటీ నెంబర్
ప్లేట్‌లలో నాణ్య త ప్రమాణాలు ఏమాత్రమూ లేవని వాహనదారులు
అభిప్రాయపడుతున్నారు. చిన్నపాటి ప్రమాదం జరిగిన ప్పుడు నంబర్ ప్లేట్
వంగిపోతోంది. దానిపై ఉన్న అక్షరాలు, నల్లని రంగు చెదిరిపోతోంది. రవాణా శాఖ
చెబుతున్నట్లుగా ఇందులో ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు కనిపించడం లేదు.
వీటిని తయారు చేసే కాంట్రాక్టర్‌కు లాభదాయకంగా ఉందని వాహన దారులు
ఆరోపిస్తున్నారు.
రవాణా శాఖ అంటేనే ఏజెంట్లు. ప్రతి పనికి మామూళ్లు ఇవ్వనిదే పనిజరగదు అనే మాట అందరి నోటా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నెంబర్‌ప్లేట్ లను వాహనాలకు బిగించడానికి మామూళ్లు డిమాం డు చేస్తున్నారు. వాహన రిజిస్ర్టేషన్ సమయంలోనే ఆయా వాహన కేటగిరీ ప్రకారం ఫీజులను వసూలు చేస్తారు. వారం రోజుల తర్వాత వచ్చి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ను బిగించుకోవాలి. ఆ సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనాల రిజిస్ర్టేషన్ సమయంలోనే రద్దీ ఉన్నట్లుగానే నెంబర్ ప్లేట్ బిగించు కునే సమయంలోనూ రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో అక్కడి సిబ్బందికి మామూళ్లు ఇస్తామంటేనే త్వరగా బిగించేస్తున్నారు. లేదంటే ఆగండి అంటూ సమాధానం చెబుతున్నారని వాహనదారులు వాపోతు న్నారు. దీనిపై పలుమార్లు వాహనదారులు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి.
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై తరచూ ఫిర్యాదులు రావడం పరిపాటిగా మారింది. దీనిపై నిర్వాహకులను హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. మళ్లీ అవే ఫిర్యాదులు వస్తుండడంతో రవాణా శాఖ అధికా రులు కొత్తగా వాహనదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారాన్ని వాహనదారులకు ఇచ్చి పలు అంశాలపై వారి నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ నెంబర్ ప్లేట్ కోసం ఫీజు ఎప్పుడు చెల్లించారు, దానికి సంబంధించిన మేసేజ్ మీ ఫోన్‌కు ఎప్పుడు వచ్చింది. నెంబర్ ప్లేట్ కోసం ఎన్నిమార్లు వెళ్లారు. బిగించడానికి డబ్బులు తీసుకున్నారా వంటి విషయాలను వాహనదా రుల నుంచి తీసుకుంటున్నారు. ఇలా గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోని 11 ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఫీడ్ బ్యాక్ పత్రాలు తీసుకొని వాటిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి పంపుతున్నారు. వాహనదారుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్వాహ కులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment