పెంపుడు
జంతువులను ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటారు. వాటికి కావలసినవన్నీ
సమకూరుస్తారు. తిండికి, ముద్దు ముచ్చట్లకు కొదవే ఉండదు. కానీ అదే పెంపుడు
జంతువు చనిపోతుందని తెలిస్తే ఏం చేస్తారు? మహా అయితే వాటికి నచ్చిన ఆహారం
పెట్టి కొద్దిరోజులైనా ప్రేమగా చూసుకుంటారు. కానీ అమెరికాకు చెందిన
రాబర్ట్ క్లగర్ మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క బెల్లాకు కేన్సర్
అనీ, ఆరునెలలు మించి బతకదని డాక్లర్లు తేల్చి చెప్పేయడంతో క్లగర్ భిన్నంగా
ఆలోచించాడు. బెల్లాతో గడిపే ఆఖరి రోజులు ఎప్పటికీ గుర్తుండిపోవా
లనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే బెల్లాతో విహారయాత్రకు బయలుదేరాడు.
న్యూయార్క్, డెట్రాయిట్, కెంటకీ, ఓహియో వంటి అనేక ప్రాంతాలు తిరుగుతూ
సరదాగా గడిపాడు. కానీ బెల్లా గడువు కంటే ముందే చనిపోవడంంతో రాబర్ట్
తట్టుకోలేకపోయాడు. ఏమైతేనేం, కుక్కని విహార యాత్రకు తీసుకెళ్ళటం మాత్రం
చెప్పుకోదగ్గ విషయమే కదా!

No comments:
Post a Comment