న్యూఢిల్లీ:
ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదనో లేక తమ సమస్యలు పట్టించుకోవడం
లేదనో, ఎవరికైనా ఏదైనా విషయంలో న్యాయం జరగలేదనో రోడ్డుపై కూర్చొని నిరసన
తెలుపుతుంటారు. ఇది కాస్త శ్రుతి మించితే ధర్నాలు, రాస్తారోకోలు కూడా
చేస్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇంకా చాలా మందిని ఇబ్బందికి
గురి చేస్తూ ఉంటాం. ఇలా సమస్యల పరిష్కారం పేరుతో ప్రజలకు అసౌకర్యాన్ని,
కొత్త సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు. ఈ వియషం తెలిసిన వారు ప్రజల్ని ఎందుకు
ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అదేదో ప్రభుత్వ కార్యాలయం ముందో, మంత్రి
గారి ఇంటి ముందో చేయోచ్చు కదా అని చెప్పాలనిపిస్తుంది. కాని చెప్పలేం.
ఎందుకంటే ధర్నా చేసేవాళ్లు ఒక్కసారిగా తమపై తిరగబడతారేమోనని భయం. లేకపోతే
అది నాకెందుకులే అనే నిర్లక్ష్యం. అంతేకాని ఆ సంఘటనను ప్రతిఘటించలేం.
కాని
ఢిల్లీలో ఓ యువతి రోడ్డుపై ధర్నా చేస్తున్న వారిని తమకు కలిగిన
అసౌకర్యానికి నిలదీసింది. ఏం చేస్తావని నిలదీసిన ఒక వ్యక్తిని చొక్కా కాలర్
పట్టుకుని నిలదీసింది. అసలు విషయమేమిటంటే ఓ యువతిని చంపేస్తాను...
లైంగికంగా కూడా దాడి చేస్తాను అని బెదిరించిన ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా
ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మాటిమాటికి ధర్నాలు చేయడం
అలవాటపోయిన ఆప్ కార్యకర్తలు తమ నేతను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ నడిరోడ్డుపై
ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఓ యువతికి చిర్రెత్తుకొచ్చి
‘అసలు ఏం జరిగుతోంది ఇక్కడ? రోజూ నాటకాలు వేస్తున్నారా?’ అని వారిపై ఆగ్రహం
వ్యక్తం చేసింది. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయండి, మేం ఆసుపత్రికి
వెళ్లాలని చెప్పింది. అంతలో ఓ ఆప్ కార్యకర్త తాము వెళ్లేది లేదని ఏం
చేసుకుంటావో చేసుకోమని అన్నాడు. మరింత ఆగ్రహానికి గురైన యువతి ఆ వ్యక్తి
చొక్కా పట్టుకుని ‘సామాన్య ప్రజలు మీకు వెదవల్లా కనబడుతున్నారా? ఇలాగేనా
నిరసనలు తెలిపేది? మాకెందుకు సమస్యలు సృష్టిస్తున్నారు? మీ ఒక్క ఎమ్మెల్యే
కోసం వేల మంది బాధ పడాలా? కార్లో పేషెంట్ ఉన్నాడని చెప్తే అర్థం కాదా?’ అని
అసహనం వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment