భారతదేశంలో
ఫేస్‌బుక్ యూజర్లందరికీ శుభవార్త! గట్టిగా ఈల వేసి చిందులేయండి.
స్టార్325హ్యాష్‌ని గుర్తుంచుకోండి. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఇంటర్నెట్
కనెక్షన్ లేకుండానే ఫేస్‌బుక్ చూడొచ్చు. దీని కోసం చేయవలసిందల్లా
స్టార్325హ్యాష్(*325#)ని ప్రెస్ చేయడమే.
ఫేస్‌బుక్
ఇండియా, ఫోనెట్‌విష్ భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైంది. ఫోనెట్‌విష్ అంటే
యూఎస్ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే
ఇంటరాక్టివ్ సర్వీస్. డేటా కనెక్షన్ లేకుండానే డివైస్‌లను కనెక్ట్
చేసుకోవడానికి యూఎస్ఎస్‌డీ అవకాశం ఇస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఫేస్‌బుక్
స్టేటస్‌ను ఉచితంగానే చూసుకోవచ్చు. పోస్టింగ్, నోటిఫికేషన్ల చెకింగ్,
ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవడం కోసం మాత్రం డబ్బు చెల్లించాలి. రోజుకు ఒక
రూపాయి చెల్లిస్తే అపరిమితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్
నుంచి స్టార్325హ్యాష్‌ను టైప్ చేసి ఫేస్‌బుక్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్
ఎంటర్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ ఫీచర్లకు యాక్సెస్ అవుతుంది. ప్రస్తుతం
భారతదేశంలో ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, ఐడియా, టాటా డొకొమో యూజర్లు మాత్రమే ఈ
సర్వీసును ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే మిగతా నెట్‌వర్క్‌లకు కూడా
విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

No comments:
Post a Comment