Thursday, 28 July 2016

ఆరోగ్యకరమైన నువ్వులు..!

నువ్వులతో ఆరోగ్యమా..! అని ఆశ్చర్యం వ్యక్తం చేయకండి.. మన నిత్య జీవితంలో వినియోగించే పదార్థాలు మెరుగైన ఆరోగ్యానికి ఉపయోగ పడుతాయి.. అలాంటి వాటిలో నువ్వులు ఒకటి.. నువ్వులు శుభానికి, అశుభానికి మన దేశంలో ఉపయోగిస్తారు.. పితృతర్పణం, కర్మకాండలకు నల్ల నువ్వులకు ప్రాముఖ్యత ఇస్తారు. నల్ల నువ్వులు శుద్ధిచేసి, పొట్టు తీస్తే తెల్లనువ్వులు. ఇది శుభానికి వాడతారు. ఇవి చాలా రుచిగా వుంటుంది. రకరకాల పిండివంటల్లో నువ్వులు కారంపొడిగాను ఆహారంగా తీసుకుాంం. ఇది వీర్యవృద్ధిని, కలుగచేస్తుంది.
చిన్న పిల్లలకు, టీనేజీ అమ్మాయిలకు, నువ్వులు-బెల్లం కలిపి ఉండలుగా ఇస్తే అలసటరాదు. చురుగ్గా వుంటారు. పిల్లలకు, పెద్దలకు నులిపురుగుల సమస్య ఉంటే, నువ్వులు వేయించిన వాము బాగా పొడిచేసి బెల్లంతో కలిపి రాత్రివేళ 1 టీ స్పూన్‌ తింటే చాలు. నువ్వుల పొడి, శొంఠి, సైంధలవణం కలిపిన పొడి బాలింతలకు ఇస్తే-ఆరోగ్యానికి ఆరోగ్యం, మందుల ఖర్చులు ఉండవు. తల్లిపాలు బాగా పడతాయి, బహిష్టు నొప్పి సమయంలో స్పూన్‌ నువ్వులపొడి, 1 స్పూన్‌ శొంఠిపొడి, చికెడు ఇంగువ కలిపి మాత్రగా చేసి ఒకపూట తింటే నొప్పి తగ్గుతుంది. ప్రతి వందగ్రాముల నువ్వుల నూనెలో తేమ 5.3 గ్రాములు, కొవ్వు 43.3 ఖనిజాలు5.2 గ్రా, రాగి 2.29 గ్రా, 2.9 మిల్లిగ్రాము పీచు పదార్థ ములు గల పౌష్టిక ఆహారం ఇది. అందుకే మహిళలు దీన్ని ఎక్కువగా వాడాలని మన పెద్దలు అన్నారు. అమ్మాయిలు రసజ్వల అయినప్పుడు శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలిపి చిమ్మిరి ఇచ్చేటప్పుడు నువ్వులు, బెల్లం కలిపి చిమ్మిరి ఇచ్చేవారు. ఇది బాలిక లకు శక్తిని, శరీర దృఢత్వం కలుగచేస్తుంది.
వ్యాధి నివారణలో నువ్వులు ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నువ్వుల విశిష్టతను వర్ణించారు. కీళ్ళనొప్పులకు వాతం, ఎముకల బలహీనత ఉన్నవారికి, శిరోజాలు ఎదగడానికి, నోటిపూత, గొంతు నొప్పి వ్యాధులకు నువ్వులు ఎంతో ఉప యోగిస్తారని ఆయుర్వేద వైద్యశాస్త్రం చెబుతుంది. ఆయుర్వేద డాక్టర్‌ సలహా ప్రకారం నువ్వులు అహారంగా తీసుకుంటే పెద్దపెద్ద ఆస్పత్రి వైద్యుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది.

No comments:

Post a Comment