Monday, 25 July 2016

ఇద్దరు వెళ్లండి.. ఒక్కరే తాగండి!

స్నేహితులతో కలిసి వాహనంలో పబ్‌కు వెళుతున్నారా? లేట్‌ నైట్‌ పార్టీలలో దోస్తులతో కలిసి మందేస్తున్నారా? ఇలా చేస్తే డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడతామని భయపడు తున్నారా? ఇకపై ఆ భయం ఉండదంటున్నారు సైబరాబాద్‌ తూర్పు కమిషనర్‌ మహేశ్‌ భగవత. ఇందుకు అమెరికాలో అమల్లో ఉన్న ‘డిసిగ్న టైడ్‌ డ్రైవర్‌ ఆఫ్‌ డే’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘‘పార్టీలకు వెళ్లినప్పుడు వాహనంలో ఉన్న అందరూ మద్యం తాగుతు న్నారు. అలా చేయడం వల్ల డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. పబ్‌లకు, లేట్‌ నైట్‌ పార్టీలకు వెళ్లినప్పుడు అందులో ఒకరు తాగకుండా ఉండి డ్రైవ్‌ చేస్తే మంచింది. అమెరికాలో ‘డిసిగ్నటైడ్‌ డ్రైవర్‌ ఆఫ్‌ డే’ మంచి ఫలితాన్ని ఇస్తోంది. అందుకే దీనిని సైబరాబాద్‌ జంట కమిషనరేట్లలో అమలు చేయాలని యోచిస్తున్నాం. ఎన్నిసార్లు చలానాలు విధించినా, కేసులు పెట్టినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో అవగాహన కల్పించినా.. తర్వాత రోజే 30 మంది డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సైబరాబాద్‌ తూర్పు కమిషనర్‌ మహేశ్‌ భగవత అన్నారు.

No comments:

Post a Comment