Thursday, 21 July 2016

‘ఒక్క అడుగు’ ఎప్పుడు?

‘ఛత్రపతి’తో ‘ఒక్క అడుగు... ఒకే అక్క అడుగు’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ‘ఛత్రపతి’ సినిమాకి ఆ డైలాగ్‌, ఆ సన్నివేశం ప్రాణం పోశాయి. ఆ తరవాత కృష్ణంరాజు ‘ఒక్క అడుగు’ అనే టైటిల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ టైటిల్‌తో ఓ స్క్రిప్టు తయారు చేయించారు కృష్ణంరాజు. ఆ చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కించాలని భావించారు. తన సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్‌లో తానే దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ ‘ఒక్క అడుగు’ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది కృష్ణంరాజు ఆలోచన. అయితే ప్రభాస్‌ ‘బాహుబలి’తో బిజీ అయిపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. ‘బాహుబలి 2’ తరవాత ప్రభాస్‌ చేయాల్సిన ప్రాజెక్టులన్నీ ఒకొక్కటిగా ఖారారవుతున్నాయి. ‘బాహుబలి 2’ తరవాత ఎలాంటి కథల్ని ఎంచుకోవాలన్న విషయంలో ఓ స్పష్టతకు వచ్చేశాడు ప్రభాస్‌. అయితే.. తాను చేయబోయే సినిమాల జాబితాలో ఈ ‘ఒక్క అడుగు’ కూడా ఉందన్నది లేటెస్ట్‌ టాలీవుడ్‌ న్యూస్‌. అయితే ఈ చిత్రానికి కృష్ణంరాజు కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని, దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని తెలుస్తోంది. మరి ‘ఒక్క అడుగు’ స్క్రిప్టు ఏ దర్శకుడి చేతికి చిక్కుతుందో చూడాలి.

No comments:

Post a Comment