Wednesday, 27 July 2016

ఆలుగడ్డలతో జీర్ణవ్యాధులకు చెక్‌!

ఆలుగడ్డ, పొటాటోగా పిలువబడే బంగాళాదుంప వృక్షశాస్త్ర నామం – సొలానమ్‌ ట్యుబరోసమ్‌. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
బంగాళాదుంపలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. పోషక విలువలు కూడా ఉన్నాయి. ఐరన్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ బి తో పాటు చెప్పుకోదగ్గ పరిమాణంలో ప్రొటిన్లు కూడా ఉంటాయి. బంగాళాదుంపలను ఉడక బెట్టి, వేయించి, ఆవిరి మీద వేడిచేసి లేదా ఇతర కూరగాయలతో కలిపి కూడా వండుకుంటారు.
ఆలుగడ్డ మొట్టమొదటగా దక్షిణ అమెరికాలో పుట్టింది. 16వ శతాబ్దంలో యూరప్‌లోకి అడుగు పెట్టింది. 17వ శతాబ్దంలో ఈ దుంప మనదేశంలో అడుగుప్టిెంది.
ఆలుగడ్డను ఉడికించేటప్పుడు దీనిలోని పోషక విలువలు పోకుండా జాగ్రత్త పడాలి. ఆలుగడ్డలోని పోషక విలువలన్ని పై పొట్టుకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి పొట్టు తీసేటప్పుడు జాగ్రత్తగా పైపైన మాత్రమే తీయాలి. బంగాళదుంపలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. దీన్ని తింటే లావుగా వున్న వారు మరింత లావు ఆవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు వీటిని తినకపోవటమే ఉత్తమం. వరసగా కొన్నాళ్ళ పాటు కేవలం బంగళాదుంపలను మాత్రమే తినటం వలన తీవ్రమైన మలబద్దకం, యూరిక్‌ యాసిడ్‌ డీసిజ్‌ మొదలైనవి తగ్గిపోతాయి. పొటాటో థెరపీ అనబడే వైద్యంలో ఆలుగడ్డలతో పాటు గ్రీన్‌ వెజిటబుల్స్‌, టమాటాలు, దోసకాయలు మొదలైన వాటిని కూడా తినవచ్చు. బంగాళాదుంపలు స్కర్వీ వ్యాధిని తగ్గించానికి పని చేస్తాయి. పచ్చి బంగళాదుంపల రసం కీళ్ళవాతాన్ని అరికడుతుందంటారు . ఆయుర్వేద వైద్యులు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి రోజూ భోజనానికి ముందు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పచ్చి బంగాళదుంపల రసాన్ని తాగితే కీళ్ళవాతం తొలగిపోతుంది. ఆ రసాన్ని తయారు చేసే విధానం ఇలా ఉంటుంది. బంగాళాదుంపలపై పొట్టును శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడక బెట్టి, తర్వాత వడ గట్టి , రోజుకు మూడు నాలుగు సార్లు రసాన్ని ఒక్కో గ్లాస్‌ చొప్పున తీసుకుంటే కీళ్ళవాతం తగ్గిపోతుంది. రోజూ భోజనానికి ముందు రెండు మూడు నాలుగు సార్లు అరకప్పు చొప్పున పచ్చి ఆలుగడ్డల రసం తాగితే జీర్ణ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. పచ్చి ఆలు గడ్డల రసాన్ని చర్మానికి రాసుకుంటే చర్మంపైన ఏర్పడిన మచ్చలు తొలగిపోయి చర్మం క్లియర్‌గా అవుతుంది.
పచ్చి ఆలుగడ్డల రసాన్ని చర్మానికి రాసుకుంటే ముడతలు, వయసు మూలంగా చర్మంపై వచ్చే మార్పులు పోయి చర్మం మృదువుగా అవుతుంది. రోజు రాత్రి పడుకోబోయే ముందు పచ్చి ఆలుగడ్డల గుజ్జుని ముఖానికి రుద్దుకోవాలి. అలా చేస్తే కొన్నాళ్ల లోపల చర్మంలో మార్పు వస్తుంది.
పచ్చి ఆలుగడ్డల రసంతో మసాజ్‌ చేసుకుంటే కాళ్ళు కండరాల బెణుకులు, వాపులు తగ్గిపోతాయి. పచ్చి ఆలుగడ్డల రసాన్ని తీసి దానిని 5వ వంతుకు ఆవిరైపోయేదాకా మరగబెట్టి , అందులో గ్లిజరిన్‌ కలిపి, బెణికిన ప్రాంతంలో మూడు గంటకు ఒకసారి చొప్పున రాసుకుంటే నొప్పి వాపు తగ్గిపోతాయి. ఆయుర్వేద వైద్యం చెప్పే ఈ పద్దతిలన్నినీ కూడా ఆయా వైద్యుల సలహా పర్యవేక్షణంలో జరపటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్న సంగతిని మరువకూడదు.

No comments:

Post a Comment