స్వతంత్ర భారతావణిలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఎన్ని కఠిన చట్టాలు చేసిన ఈ ఘోరకలి ఆగడం లేదు.. కామాంధుల పైశాచిక ఆనందానికి
పిల్లలు, ముసలి వారు అనే తేడా లేకుండా బలైతున్నారు. అయితే మనం కొన్ని
జాగ్రత్తలు పాటిస్తే ఈ ఆఘాయిత్యాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది...
ఆటోలలో ప్రయాణం చేస్తున్నప్పుడు..
మనుషుల సంచారం ఉండే వీధులగుండా ఆటో ప్రయాణించేలా చూసుకోండి..
మీరు ఉండగా మరెవర్నయినా ఆటోలో ఎక్కించుకునేందుకు అంగీకరించకండి.
సాధ్యమైనంతవరకు పెద్ద వయసు ఆటో డ్రైవర్ ఉన్న ఆటోనే ఎంపిక చేసుకోండి.
డ్రైవర్‌కు మీరు వెళ్లే ప్రాంతానికి కొత్త వారన్న అనుమానం రాకుండా ప్రవర్తించండి.
రాత్రి సమయంలో ట్రైయిన్ లేదా బస్ దిగి ఒంటరిగా ఆటో ఎక్కాల్సిన అవసరం వస్తే మీకు అందుబాటులో ఉన్న పోలీస్ వారి సహాయం అడగండి. ఆటో వివరాలు నోట్ చేసుకుని మిమ్మల్ని ఆటో ఎక్కించి పంపిస్తారు.
ఆటో ఎక్కిన తరువాత మీ వద్ద సెల్‌ఫోన్ ఉంటే ఫోన్‌లో ఆత్మీయులతో మాట్లాడుతుండండి. ఇప్పుడే బస్ దిగాను. ఆటో ఎక్కాను ఫలానా వీధి దాటుతున్నాను ఇలా మాట్లాడండి.
వీధుల్లో పాటించాలిసిన జాగ్రత్తలు..
జనం చాలా తక్కువగా కన్పించే వీధుల గుండా ఒంటరిగా నడవకండి.
వెలుతురు బాగా తక్కువగా ఉన్న వీధుల గుండా రాత్రి సమయంలో నడవకండి.
నడుస్తున్నప్పుడు ఎవరైనా అపరిచితులు పలకరిస్తే మాట్లాడకండి.
మీరు ఒంటరిగా వీధులో నడుస్తున్నప్పుడు ప్రక్కనే ఆగి ఉన్న కారు నుండి సహాయం కోరుతూ ఎవరయినా పిలిస్తే ఆ కారు వద్దకు వెళ్ళకండి.
కారులోంచి చెయ్యి చాపి మిమ్మల్ని కారులోకి లాగే ప్రయత్నం చేస్తే పెద్దగా అరవండి.. కారు వెళుతున్న వైపుకు వ్యతిరేక దిశ లో పరుగెత్తండి.
మిమ్మల్ని వీధిలో ఎవరన్నా ఫాలో అవుతున్నారన్న అనుమానం వస్తే అక్కడకు దగ్గరలో ఉన్న ఏదో వ్యాపార సంస్థలోకి వెళ్ళి అక్కడి వ్యక్తులకు విషయం తెలియచేయండి.. లేదా పోలీస్ స్టేషన్‌కో, కంట్రోల్ రూమ్‌కో ఫోన్ చేసి విషయం తెలియజేయండి.
ఒకరి కన్న ఎక్కువ వ్యక్తులు మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు మీకు అనిపిస్తే ఎదురు తిరిగే ప్రయత్నం చేయకుండా తగిన పరిస్థితి అనుకున్నప్పుడు దగ్గరలో నేలపై ఉన్న దుమ్మును కానీ మట్టిని వారి మోహాన విసిరి వాళ్ళు కళ్ళు నులుముకుని, కళ్ళు తెరిచేలోపే పారిపోండి.
ఒంటరి ప్రయాణాలలో..
సింపుల్‌గా తయారు కండి.. పది మంది కళ్ళు మీ పద పడేలా మేకప్ వేసుకోవద్దు…
ప్రయాణంలో ఆభరణలు ఎట్టి పరిస్థితులలోను ధరించవద్దు.. ఒకవేళ ధరించాల్సి వస్తే మీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళండి..
మీకు పరిచయం లేని ప్రదేశాలకు, కొత్త చోట్లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మీ బంధువుల్నో, స్నేహితుల్నో మిమ్మల్ని పికప్ చేసుకునేలా తగు ఏర్పాట్లు చేసుకోండి.
ప్రయాణంలో చేస్తున్నప్పుడు వీలైనంతగా మన వివరాలు ఎవరితోనే పంచుకోరాదు..
డ్రైవింగ్ చేస్తుంటే!..
మీకు పరిచయం లేని వారు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకోకండి.
మీకు కారు ఉంటే వాటి డోర్స్ ఎప్పుడూ లోపల వైపు లాక్ చేసి ఉంచండి.
రాత్రి సమయంలో కార్ పార్క్ చేసే సమయంలో బాగా వెలుతురుగా ఉన్న చోట పార్క్ చేయండి. మీరు తిరిగి వచ్చే సరికి కూడా ఆ ప్రాంతంలో వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి.
రాత్రి సమయంలో ఒంటరిగా కార్‌లో ప్రయాణించటం తప్పనిసరి అయితే ఇంధనం ట్యాంక్ లో ఫుల్ గా ఉండేలా చూసుకోండి. ఇంధనం లేక వెహికల్ అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి రాకూడదు.

No comments:
Post a Comment