మెగాస్టార్
రీఎంట్రీ గురించి చర్చ మొదలైనప్పటి నుంచి కథ, దర్శకుడు, హీరోయిన్, టైటిల్
ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళమే నెలకొంది. అయితే, చిన్నగా ఒక్క హీరోయిన్
విషయంలో మినహా మిగిలిన విషయాల్లో చిరు క్లారిటీ ఇవ్వడమే కాక షూటింగ్‌లో
సైతం జోరుగా పాల్గొంటున్నాడు. చిరంజీవి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో విజయవంతమైన ‘కత్తి’ కథ ఆధారంగా
దర్శకుడు వినాయక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
శరవేగంగా
షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ చిత్రం టైటిల్‌పై మాత్రం సంగ్ధిదత నెలకొంది. ఈ
సంగ్ధిదతకు చరమాంకం పాడుతూ చిరు 150వ చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ
చిత్రానికి టైటిల్ ‘నెపోలియన్’ అని ధృవీకరిస్తూ ‘పోరాటం అతని నైజం’ అనే
ఉపశీర్షికను జత చేశారు. చిరంజీవి అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో ‘మెగాస్టార్
చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారు’ అంటూ టైటిల్‌కు సంబంధించిన ఫొటోను
పోస్ట్ చేశారు. ఆ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతు ఫొటోను,
చిరంజీవి ఫొటోను ఇచ్చి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్
మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను ప్రచురించారు. ఈ
చిత్రంలో ల్యాండ్ మాఫియా, రైతుల ఆత్మహత్యలు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా
పోరాడే వ్యక్తిగా చిరు కనిపించనున్నట్లు ఈ ఫొటో ధృవీకరిస్తోంది. తన
రీఎంట్రీ ఎలా ఉండబోతుందో ఇప్పటికీ నేరుగా చెప్పని మెగాస్టార్ ఈ పోస్టర్‌తో
విందుకు సిద్ధంగా ఉండాలని తన అభిమానులకు సూచించినట్లుగా ఉంది.

No comments:
Post a Comment