పార్శిల్‌లో వచ్చింది చూసి అవాక్కయ్యాడు !
ఆన్‌లైన్‌లో 11వేలకు శామ్‌సంగ్ గెలాక్సీ జె5 ఫోర్‌జీ ఫోన్ బుక్ చేస్తే...
తక్కువ ధరకు వస్తాయని ఆశ
పడి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అయితే
ఆన్‌లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేసిన వస్తువుకు బదులు వేరే వస్తువు
వినియోగదారులకు వస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే
పాలకోడేరు మండలం శృంగవృక్షంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలోని
సబ్బితిపేటకు చెందిన వర్ధనపు కిరణ్‌కుమార్ ఆన్‌లైన్‌లో శ్యామ్‌సంగ్
గెలాక్సీ జె5 ఫోర్‌జీ ఫోన్‌ను రూ.11,459లకు కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ
ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలో బుక్ చేసుకున్నాడు. బుధవారం భీమవరం నుంచి
వచ్చిన ఓ కొరియర్ బాయ్ కొరియర్ వచ్చిందంటూ ఓ పార్శిల్ అందించి
వెళ్లిపోయాడు. కిరణ్‌కుమార్ ఆ ప్యాకింగ్ విప్పి చూసుకోగా ఆ ప్యాకింగ్‌లో
సూపర్ నిర్మా సబ్బు ఉండటంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని సంబంధిత కొరియర్
ఆఫీస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మెయిల్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్
కంపెనీకి సమాచారం ఇస్తామని వారు తెలిపారు.
No comments:
Post a Comment