టోగో అధ్యక్షుడు రాజీనామా
చేయాలని డిమాండ్ చేస్తూ టాంగో మహిళలు సెక్స్ సమ్మె చేపట్టారు. రోజుల తరబడి
తమ నిరసనను కొనసాగించారు. టోగోలో దశాబ్దకాలంగా కొనసాగుతున్న కుటుంబ పాలనకు
చరమగీతం పాడాలని, అధ్యక్షుడు ఫౌరే గన్నాసింగ్‌బే రాజీనామా చేయాలని ప్రజలు
డిమాండ్ చేస్తూ వచ్చారు. అయినా అధ్యక్షుడిలో ఎటువంటి చలనం లేకపోవడంతో టాంగో
మహిళలు సెక్స్ సమ్మెకు దిగారు. బహుశా ఇటువంటి సమ్మె ప్రపంచంలో మరెక్కడా
జరిగి ఉండదేమో. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. నాలుగేళ్ల క్రితం ఆగస్టు,
2012లో జరిగిన ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం
సృష్టించింది. వీరి సెక్స్ సమ్మెకు విపక్ష పార్టీలు, ప్రజలు, పశ్చిమ
ఆఫ్రికా దేశాల్లోని పలు ఉద్యమ సంస్థలు కూడా మద్దతు పలికాయి. సెక్స్ సమ్మె
తమకు పదునైన ఆయుధమని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇసాబెల్లె అమెగన్వి
అప్పట్లో పేర్కొన్నారు. 2003లో శాంతికోసం లైబీరియన్ మహిళలు ఇటువంటి సమ్మెనే
చేపట్టారని, దానిని నుంచి స్ఫూర్తి పొంది ఈ సమ్మెకు దిగినట్టు ఆమె
వివరించారు.

No comments:
Post a Comment