వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు మరి. ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే...
- పళ్లరసాలు, లస్సీ, పెరుగు, చెరకు రసాలు అస్సలంటే అస్సలు తాగొద్దు.
- బంగాళా దుంపలు, మొలకెత్తిన గింజలు, కందులు, గోరుచిక్కుడు వంటి అజీర్ణానికి కారణమయ్యే పదార్థాలు తినకుండా ఉంటే బెటర్.
- వీధుల్లో బండ్ల మీద లభించే చాట్, సమోసా, పానీపూరీలకి బిగ్ నో.
- సమోసా, పకోడీ వంటి కొవ్వు అధికంగా ఉన్నవి, వేపుళ్లు, బర్గర్లు, అధికంగా ఉప్పు ఉండే పచ్చళ్లు, చట్నీలు తినడం మానేయాలి.
- ఆవ, నువ్వుల నూనెలకి బదులు మొక్కజొన్న, ఆలివ్ నూనెలు వాడితే తిన్నది త్వరగా జీర్ణమవుతుంది.
- ఈ సీజన్‌లో పచ్చి ఆహారం తినడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే పచ్చి పదార్థాల్లో ఉండే ఎంజైమ్‌లను జీర్ణవ్యవస్థ సరిగా జీర్ణం చేసుకోలేదు. అంతేకాకుండా పచ్చి వాటి మీద బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి.
- రెస్టారెంట్లు, పార్టీలు, ఫంక్షన్లలో ఆకుకూరల వంటకాలు, సలాడ్‌లు తినకూడదు. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాల్లో సూక్ష్మజీవులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
- పుచ్చకాయ, కీర వంటి నీరు కలిగిన పళ్లను బండ్ల మీద ముక్కలు కోసి అమ్ముతుంటే తినొద్దు.
- పచ్చి గుడ్డు, సీ ఫుడ్‌లను వర్షాకాలంలో తినకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ సీజన్‌లో కొన్ని రకాల చేపలు, రొయ్యలకి బ్రీడింగ్ సమయం. దానివల్ల పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ చేపలు కొనాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి.
- * సాధారణంగా
ఈ కాలంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులే అధికం. కాబట్టి తాగే నీటి
విషయంలో జాగ్రత్త పాటించాలి. తప్పనిసరిగా కాచి చల్లార్చిన లేదా, వడకట్టిన
నీటినే తాగాలి. నాలుగు చినుకులు పడగానే చాట్ తినాలని మనసు
ఉవ్విళ్లూరుతుంది. కానీ రోడ్డు వారన దొరికే అలాంటి చిరుతిళ్లు
తినాలనుకునేటప్పుడు తప్పనిసరిగా పచ్చి కాయగూరలు ముక్కలు అంటే
ఉల్లిపాయముక్కలూ, కీరదోస, క్యారెట్ తురుము వంటివి లేకుండా చూసుకోండి. ఈ
కాలంలో నిల్వ ఉంచిన పచ్చి కాయగూర ముక్కల నుంచి వ్యాధులు త్వరగా వ్యాపించే
ప్రమాదం ఉంది.
* వర్షాకాలం కదా పదేపదే నీళ్లు తాగితే మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని అనుకోవద్దు. బదులుగా కాఫీ, టీలు తాగే ప్రయత్నం అసలే చేయొద్దు. కాచి చల్లార్చిన నీటినీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండే హెర్బల్ టీలను మాత్రమే తాగడం మంచిది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
* వానలో నడవడం సరదాగానే ఉండొచ్చు. కానీ కాళ్లూ, గోళ్ల నుంచి కొన్ని రకాల క్రిములు శరీరంలోకి చొరబడి ఇన్‌ఫెక్షన్లు రావడానికి కారణమవుతాయి. తడిసిన బూట్లూ, సాక్సులతో ఎక్కువ సేపు ఉండొద్దు. ఒక వేళ ఆఫీసుకు వెళ్తుంటే మాత్రం ముందు జాగ్రత్తతో ఒక జత సాక్సులని బ్యాగులో ఉంచుకుంటే మేలు.
* శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారు ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటి పరిసరాల్లో పాత వస్తువులు పేరుకుని ఉంటే తీసి పారేయాలి. వాటి కారణంగా వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతాయి. అవి అనారోగ్యానికి కారణం కావచ్చు.

No comments:
Post a Comment