Saturday, 23 July 2016

రైలు టికెట్ లేదని బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

మహారాష్ట్ర (గోండియా) : రైలు టికెట్ లేదని చెప్పిన బాలికను వెంట తీసుకువెళ్లిన యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన మహారాష్ట్రలోని గోండియా పట్టణంలో జరిగింది. పదోతరగతి చదువుతున్న 16 ఏళ్ల వయసుగల బాలిక తన తండ్రి, సోదరుడితో కలిసి బసంత్ నగర్ ప్రాంతంలో ఉంటోంది. బాలిక బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ గోండియా రైల్వేస్టేషనులో దిగింది. రైల్వేస్టేషనులో ఒంటరిగా ఉన్న బాలికతో నితీష్ రామదాసు బ్రహ్మాంకర్, ఛోట్టు అలియాస్ ప్రశాంత్ మోట్ఘేర్ లనే ఇద్దరు యువకులు మాటలు కలిపారు. మాటల్లో తన వద్ద రైలు టికెట్ లేదని బాలిక చెప్పడంతో టికెట్ కలెక్టర్ల బారిన పడకుండా ఆమెను బయటకు తీసుకువెళ్లారు. గోండియా రైల్వే క్రాసింగ్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటికి బాలికను తీసుకువెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం జరిపారు. అనంతరం వారి స్నేహితులైన కలీంరఫీఖ్ ఖాన్, ముఖేష్ దేవిదాస్ మెష్రం లనే మరో ఇద్దరు యువకులు వచ్చి వారు కూడా బాలికపై అత్యాచారం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు అత్యాచారం గురించి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment