Saturday, 23 July 2016

‘కబాలి’ రీమేక్‌లో బిగ్‌బి?

ముంబయి: పా రంజిత్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కబాలి’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారట. ఇందులో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ రజినీ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ‘బచ్చన్‌ కబాలి రీమేక్‌లో నటించనున్నారు. రజినీ తమిళ చిత్రాలు హిందీలో అంతగా ఆడవు. ఎందుకంటే.. తమిళనాడు కల్చర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. మలేషియాలో తమిళ ప్రజలజీవితంపై కబాలి చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ఫ్లేవర్‌, డైలాగ్స్‌, సంస్కృతి తమిళనాడుని ప్రతిబింబించేలా ఉంటాయి’ అని ఫిలిం వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపినట్లు సమాచారం.
రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు. అమితాబ్‌ హిందీలో నటించిన కొన్ని చిత్రాల తమిళ రీమేక్‌లో రజినీకాంత్‌ నటించారు.

No comments:

Post a Comment