ఇండియాలో
మగాళ్లందరికీ ప్రధాన శత్రువు డైలీ సీరియల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం
లేదేమో. పల్లెల నుంచి మహానగరాల దాకా సాయంత్రం 6 దాటితే చాలు ఏడుపులు,
పెడబొబ్బలే. రాత్రి 10 గంటల దాకా ఆ కన్నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది.
ఆడోళ్లకు ఫేవరెట్‌గా, మగాళ్లకు చేరుకోలేని టార్గెట్‌గా మారిన ఈ సీరియల్స్
జాడ్యం రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సీరియల్స్ అంటే ఒక సీన్‌ను
సాగతీసితీసి మధ్యమధ్యలో ఒకటికి నాలుగుసార్లు యాడ్స్ వేయడం అందరూ చూసి
ఉంటారు. అయితే సీరియల్ నిజంగా రియల్ కాదు. ఎంత రియల్ కాకపోయినా జనాన్ని మరీ
ఇంత మోసం చేయడం అవసరమా అని ఈ సీన్ చూస్తే మీకనిపిస్తోంది. తమిళంలో
ప్రసారమయ్యే చంద్రకళ అనే ధారావాహిక చూస్తే కన్నీరు ధారలా ప్రవహిస్తుంది.
ప్రేక్షకులను వీలైనంతగా ఏడిపించాలనే ఈ సీరియల్ తీసినట్టున్నారు నిర్మాతలు.
అయితే
ఇటీవల జూలై 23న ప్రసారమయిన చంద్రకళ ఎపిసోడ్ హాట్ న్యూస్ అయింది. దీనికి
కారణం ఆ సీన్ సాగిన విధానమే. హీరోయిన్‌ను పాయింట్ బ్లాంక్‌లో ఓ వ్యక్తి
గన్‌తో కాలుస్తాడు. సాధారణంగా పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ తగిలితే ఎవరైనా
క్షణాల్లో నేలకొరుగుతారు. కానీ సీరియల్ హీరోయిన్ మాత్రం దీనికి పూర్తి
భిన్నం. అలా పడిపోతే వెరైటీ ఏముందనుకున్నాడో ఏమో బుల్లెట్ తగిలిన తర్వాత
దాదాపు రెండు నిమిషాల పాటు ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. తన భర్త చేత
మల్లెపూలు పెట్టించుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అరాచకాలు అన్నీఇన్నీ
కావు. మేం చెప్పడం కంటే మీరు చూస్తూనే ఆ కామెడీ ఏంటో తెలుస్తుంది. సోషల్
మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆ సీరియల్ క్లిప్పింగ్‌ను మీరూ ఓసారి
చూడండి.

No comments:
Post a Comment