Monday, 18 July 2016

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌!

ప్రముఖ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ తన ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో మాత్రమే ఉన్న ఆఫ్‌లైన్‌లో వీడియోలు వీక్షించే సదుపాయం ఇకపై ఫేస్‌బుక్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఒక వీడియోను మనకు నచ్చినప్పుడు చూడాలనుకుంటే ‘సేవ్‌’ ఆప్షన్‌ ద్వారా ఆఫ్‌లైన్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. అలా సేవ్‌ అయిన వీడియో యాప్‌లో నిక్షిప్తమవుతుంది. దీన్ని షేర్‌ చేయడం, ఫైల్‌ మేనేజర్‌లో చూసుకునే వీలుండదు. ఈ కొత్త సదుపాయం ద్వారా నచ్చిన వీడియోను ఎటువంటి డేటా ఖర్చు లేకుండా కావాల్సినన్ని సార్లు చూడొచ్చు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో లభ్యమవుతోంది. మరికొద్దిరోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment