రైల్వే ఆన్ లైన్ టికెట్ల కొనుగోలులో మోసాలను అరికట్టేందుకు ఆధార్
నంబర్‌ను తప్పనిసరి చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఐఆర్‌సీటీసీ వన్ టైమ్
రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆధార్‌ను తప్పనిసరి చేయనుంది. దీనివల్ల బల్క్
టికెట్ల బుకింగ్‌లను అరికట్టడంతోపాటు మరొకరి పేరుతో టికెట్ బుకింగ్
చేయడాన్ని కూడా అడ్డుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లలో రాయితీ పొందేందుకు ఏప్రిల్ 1 నుంచి ఆధార్ తప్పక సమర్పించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశిం చింది. దీన్ని మూడు నెలల పాటు ప్రయోగా త్మకంగా అమలు చేయనుంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వేశాఖ 2017–18 కొత్త బిజినెస్ ప్లాన్ ను గురువారం ప్రవేశపెట్టారు. ఇందులో ఆధార్ తప్పనిసరి చేయడంతోపాటు నగదు రహిత టికెట్ల కొనుగోలు లక్ష్యంగా అడుగులు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు వేల పీవోఎస్ మెషీన్లను, వెయ్యి ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టికెటింగ్ యాప్‌ను కూడా రైల్వేశాఖ మేలో ఆవిష్కరించనుంది. అంతేకాదు ఐఆర్‌సీటీసీలో నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేసేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది.

No comments:
Post a Comment