రిలయన్స్ జియో మరో ఘనత ను సాధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(SBI) భాగస్వామ్యంతో ఏర్పాటైన జియో పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు
ప్రారంభించేందుకు RBI అనుమతిని పొందింది. చెల్లింపు బ్యాంక్ సేవలను ఈ నెల
చివరి కల్లా ప్రాంభించాలని సంస్థ భావిస్తోంది.
ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్‌లు పేమెంట్ బ్యాంకులుగా కార్య కలాపాలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతి పొందాయి. ఆన్‌లైన్ లావా దేవీలు పెరిగిన క్రమంలో సంప్రదాయ బ్యాంకులకు దీటుగా వివిధ పేమెంట్ బ్యాంకులకు RBI అనుమతులు ఇస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి రిలయన్స్ జియో వచ్చి చేరింది. జియో సేవలను ప్రారంభించిన ఆరు నెలల్లోనే 10 కోట్లకు పైగా యూజర్లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. త్వరగా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించడం ద్వారా లాభాలను ఆర్జించాలని, ఇందుకు పేమెంట్స్ బ్యాంకు సహకరిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. దీంతో అటు మొబైల్ ఫోన్ వినియోగం, ఇటు డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి గట్టి పోటీ ఎదురుకానుంది.

No comments:
Post a Comment