ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో
స్టీరింగ్‌పైనే కుప్ప కూలిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని నారాయణగూడ
దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. BVRIT కాలేజీ బస్సు నారాయణగూడ మీదుగా
వెళ్తుండగా.. బస్సులో డీజిల్ అయిపోవడంతో డ్రైవర్ రసూల్ రోడ్డులో పక్కకు
ఆపాడు. ఇంతలోనే అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా
స్టీరింగ్‌పైన ఒరిగిపోయి ప్రాణాలు వదిలాడు. విద్యార్థులు ఫోన్ చేయడంతో ఘటనా
స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో పరిక్షించిన డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించారు.

No comments:
Post a Comment