హైదరాబాద్ లో 5 రూపాయల భోజన కేంద్రాలు ప్రారంభించి మూడేళ్లవుతుంది.
2014, మార్చి 2న జీహెచ్ఎంసీ మొదట 5 కేంద్రాలను ప్రారంభించింది. డిమాండ్
పెరగడంతో వీటి సంఖ్య పెంచుతూ వస్తోంది. 5 రూపాయల మీల్స్ తో ప్రతిరోజు 30
వేల మంది కడుపు నింపుకుంటున్నారు. ఒక్క ప్లేట్ మీల్స్ కు 24 రూపాయల వరకు
ఖర్చవుతుంటే..19 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది. మిగితా 5 రూపాయలు
లభ్దిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నిర్వహణ అంతా హరేకృష్ణా స్వచ్చంధ
సంస్థ చూసుకుంటోంది.
సిటీలో ఇప్పటి వరకు 5 రూపాయల భోజన సెంటర్లు 108 ఉన్నాయి. పబ్లిక్ ప్లేస్ లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్స్, రైల్వేస్టేషన్, మేయిన్ సెంటర్లలో ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రాలు రోగులతో పాటు వారి బంధువులకు ఆసరా అవుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేసిన సెంటర్ల దగ్గర భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కండుపు నింపుతున్నాయి.
సిటీ లైబ్రరీ దగ్గర పెట్టిన సెంటర్ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు.. వండుకునే సమయం వెస్ట్ కాకుండా 5 రూపాయల భోజనం ఉపయోగపడుతోంది.
5 రూపాయల భోజన కేంద్రాలు చాలా ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కార్మికులకు, నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు ఆసరా అవుతున్నాయని అంటున్నారు. స్వచ్చంధంగా ఇచ్చే విరాళాలతో కూడా మీల్స్ అందిస్తున్నారు. రానున్న రోజుల్లో భోజన సెంటర్ల సంఖ్య 150 వరకు పెంచాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

No comments:
Post a Comment