Friday, 29 April 2016

మొబైల్‌కు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ ద్వారా చార్జింగ్‌ పెడుతున్నారా?

మితంగా చార్జింగ్‌.. అమితంగా బ్యాటరీ వాడకం.. అస్తమానం మొబైల్‌ వాడుతూ ఉండటం వల్ల చార్జింగ్‌ పెట్టేందుకు సాధారణంగా సమయం దొరకదు. దాని వల్ల రాత్రి మొత్తం చార్జింగ్‌ పెట్టి ఉదయమే తీస్తుంటారు. ఈ విధానం వల్ల బ్యాటరీ త్వరగా దాని సామర్థ్యం కోల్పోతూ ఉంటుంది.
 
బ్యాటరీ నిర్వహణలో చిట్కాలు...
1. బ్యాటరీ 90 శాతం నిండే లోపే చార్జింగ్‌ తీసే యాలి. అంతకన్నా ఎక్కువగా చార్జింగ్‌ ఉంచితే క్రమేణా దాని సామర్థ్యం కోల్పోతుంది.
2. సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్యలోనే చార్జింగ్‌ వాడకం ఉండాలి. 20 శాతం కన్నా తక్కువ చార్జింగ్‌ వాడుతున్నప్పుడు రేడియేషన్‌ కూడా ఎక్కు వగా ఉంటుందని నిపుణులు హెచ్చరిసున్నారు.
 
కంప్యూటర్‌ ద్వారా చార్జింగ్‌ మంచిదా..?
  • మామూలు చార్జర్‌తో 5 వోల్ట్స్‌, 1 యాంప్స్‌ విద్యుత్తు వస్తుంది. అదే కంప్యూటర్‌ యూఎస్‌బీ నుంచి 5 వోల్డ్స్‌, 0.5 యాంప్స్‌ వస్తుంది.
  • యాంప్స్‌ తేడా వల్ల చార్జింగ్‌ అయ్యే వేగం తగ్గుతుంది తప్పా వేరే ఇబ్బంది ఉండదు. సాధారణ చార్జర్‌తో వేగంగా అవుతుంది ఫోన్‌ కొంత మేర వేడెక్కుతుంది. అదే యూఎస్‌బీ నుంచి అయితే వేగం తక్కువైనా వేడి ఎక్కడం తక్కువగా ఉంటుంది.
  • యూఎస్‌బీ 3.0 నుంచి మాత్రం 0.900 యాంప్స్‌ రావడం వల్ల సాధారణ చార్జర్‌కి దానికి పెద్దగా తేడా ఉండదు. పైగా నష్టం కూడా లేదు.
  • యూఎస్‌బీ ద్వారా చార్జింగ్‌ చేసుకోవాలంటే సిస్టమ్‌ నుంచి నేరుగా పెట్టుకోవాలి తప్పా యూఎస్‌బీ హబ్‌ ద్వారా పెట్టుకోకూడదు. దానికి కనెక్ట్‌ చేసిన వేరు డివైస్‌ల వల్ల కొంత ఇబ్బంది కలిగి చార్జింగ్‌ అయ్యే విధానంలో వ్యత్యాసాలు ఏర్పాడతాయి.

No comments:

Post a Comment