Thursday, 21 April 2016

ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లకు గుడ్ న్యూస్

ఫేస్‌బుక్ యూజర్లు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు !

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు చల్లని కబురు చెప్పింది. బుధవారం ఫేస్‌బుక్ ఓ నూతన ఆవిష్కరణకు తెరతీసింది. ఫేస్‌బుక్ అనుబంధ యాప్ మెసెంజర్‌లో ఫ్రీ గ్రూప్ వాయిస్ కాల్స్‌ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు చేరుతాయని ఫేస్‌బుక్ మెసెంజర్ చీఫ్ డేవిడ్ మార్కస్ తెలిపారు. గ్రూప్ కాల్‌లో ప్రస్తుతానికి 50 మందితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. ఈ పరిమితిని మరింత విస్తృతం చేయాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఇప్పటికే స్కైప్, గూగుల్ హ్యాంగౌట్స్, స్లాక్ వంటి యాప్స్‌లో ఈ గ్రూప్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.

No comments:

Post a Comment