మన దేశంలోనే అతి
పెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)కి
దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఎస్‌బిఐ ప్రస్తుతం జూనియర్ అసోసియేట్స్
(కస్టమర్ సపోర్ట్ సేల్స్), జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్
పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 13,734. అందులో
జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ సేల్స్) 10,726 కాగా జూనియర్
అగ్రికల్చర్ అసోసియేట్ పోస్టులు 3,008 ఉన్నాయి.
జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ సేల్స్):
తెలంగాణలో 431 పోస్టులు, ఆంధ్రప్రదేశలో 1,385 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీకి తెలంగాణలో 217, ఆంధ్రప్రదేశలో 695 పోస్టులు కేటాయించారు. జూన 30 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు
జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్:
తెలంగాణలో
108 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీకి
తెలంగాణలో 55, ఆంధ్రప్రదేశ్‌లో 195 పోస్టులు కేటాయించారు. అగ్రికల్చర్‌లో
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ
ఏడాది ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 1988
ఏప్రిల్ 1కి ముందు, 1996 ఏప్రిల్ 1 తరవాత జన్మించి ఉండరాదు. ప్రిలిమినరీ,
మెయిన ఎగ్జామ్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.100
చెల్లించాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఆనలైన్ మోడ్‌లో
నిర్వహిస్తారు. గంట వ్యవధిగల ఈ పేపర్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్
ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన 100 ప్రశ్నలు ఇస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను ఫైనల్ సెలెక్షనలో పరిగణనలోకి
తీసుకోరు. మెయిన్ ఎగ్జామ్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు మాత్రమే
ఈ టెస్ట్‌ని ఉద్దేశించారు.
మెయిన్
ఎగ్జామ్‌లో నాలుగు టెస్ట్‌లు ఉంటాయి. ఈ పరీక్ష కూడా ఆనలైన్ విధానంలోనే
జరుగుతుంది. రెండు గంటల 40 నిమిషాలసేపు జరిగే ఈ పరీక్షలో జనరల్/ ఫైనాన్స
అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్
ఎబిలిటీ కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించిన 190 ప్రశ్నలు ఇస్తారు. మెయిన
ఎగ్జామ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలెక్షన ఉంటుంది.
అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తారా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకునే
నిర్ణయానికి లోబడి ఉంటుంది. ఈ పరీక్షలను మే, జూన నెలల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. ఏప్రిల్ 25లోగా
దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.sbi.co.in
Total No. of Vacancies: 13734 posts
1) Jr. Associates (Customer Support and Sales) : 10726
2) Jr. Agriculture Associates: 3008
3) Jr. Associate (Backlog): 3218
4) Jr. Associate (Special Recruitment for Kashmir, Ladakh and Mehalaya): 188

No comments:
Post a Comment