Friday, 29 April 2016

ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ వడ్డీ రేటు పెంచిన కేంద్రం..

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి విషయంలో కేంద్రంపై మరోసారి వెనక్కి తగ్గింది. పీఎఫ్‌పై వడ్డీని 8.8 శాతానికి పెంచింది. కమిటీ సూచనలను పక్కన పెట్టిన ఆర్థిక శాఖ పీఎఫ్‌పై వడ్డీని 8.7 శాతంగా ఇటీవల ప్రకటించింది. కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్షాల నుంచి దీనిపై విమర్శలు రావడంతో దీన్ని కాస్త పెంచింది. అలాగే ఉద్యోగ భవిష్య నిధిని 58 ఏళ్ళ వయసు వరకు మొత్తం విత్ డ్రా చేయకూడదన్న ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ నిర్ణయంపైనా కేంద్రం వెనక్కి తగ్గింది. ఆరు నెలల పాటు పాత విధానమే అమలులో ఉంటుందని ఇటీవల ప్రకటించింది.

No comments:

Post a Comment