Thursday, 14 April 2016

గూగుల్‌ ‘వాయిస్‌ యాక్సెస్‌’ ఫీచర్‌

స్మార్ట్‌ఫోన్‌ను చేత్తో ఆపరేట్‌ చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారా..? అయితే.. ఇక ఆ మాత్రం ఇబ్బంది కూడా పడాల్సిన పనిలేదు. చేయితో పనిలేకుండా.. వాయిస్‌తోనే ఫోన్‌ను వాడేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది.
చూపు లేని వారికి.. చేతులు లేని వారు సైతం సులభంగా స్మార్ట్‌ఫోన్‌ వాడేందుకు వీలుగా ‘‘వాయిస్‌ యాక్సెస్‌’’ సదుపాయాన్ని అందిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఫోన్‌లోని యాప్‌లను ఓపెన్‌ చేయాలన్నా.. మెసేజ్‌లు టైప్‌ చేయాలన్నా.. నోటితో చెబితే అందుకు అనుగుణంగా ఫోన్‌ పనిచేస్తుంది. ­దాహరణకు ఫోన్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ను తెరిచేందుకు ‘‘ఓపెన్‌ క్రోమ్‌’’ అని.. యాప్‌లో కిందికి వెళ్లేందుకు ‘‘స్క్రోల్‌ డౌన్‌’’ అని.. హోంకి వెళ్లేందుకు ‘‘గో హోం’’ అని చెబితే చాలు.
ప్రస్తుతం బీటా వెర్షన్‌(టెస్టింగ్‌ దశ)లో ఉన్న ఈ ఫీచర్‌ను ‘‘ఆండ్రాయిడ్‌ ఎన్‌’లో అందించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది

No comments:

Post a Comment