Sunday, 17 April 2016

సర్వే లు చెప్పినా నిజం… కాబోయే సీఎం పవన్ కళ్యాణే..

2019 ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడు మాట్లాడితే… ఆలూ లేదూ చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అనిపించొచ్చు.. అతిశయోక్తిగా అనిపించినా ఇది వాస్తవం.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గట్టిగా కృషి చేస్తే సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ అంచనాలను గాలి మాటలు గా కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే.. తాజాగా వచ్చిన సర్వే ఫలితాల్లో ఆసక్తికమైన అంశం ఇదే.
తాజాగా ఏపీ రాజకీయాలు, ప్రభుత్వ పనితీరుపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. మీడియా సేవల్లో ఈ సంస్థకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రాలో పొలిటికల్ వాక్యూమ్ చాలా ఉంది.. అదేంటి ఓవైపు టీడీపీ మహా శక్తిగా ఉంది.. మరోవైపు బలమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ ఉంది. కాస్తో కూస్తో పేరున్న బీజేపీ, కాంగ్రెస్ వంటి శక్తులు ఉండనే ఉన్నాయి.
అయినా ఇంకా ఆంధ్రాలో పొలిటికల్ వాక్యూమ్ ఎక్కడ ఉందన్న అనుమానం కలగొచ్చు. కానీ సీఎంఎస్ సర్వే చెబుతున్నదేమిటంటే.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ , బీజేపీ ఉన్నా.. వీటిపై ప్రజలకు రోజురోజుకూ నమ్మకం సడలిపోతోందట. అధికార పార్టీపై నమ్మకంపోతే ఆ పరిణామం ప్రతిపక్షానికి లాభించాలి. ఇది రొటీన్ గా జరిగే వ్యవహారమే. కానీ ఇక్కడ అలా జరగడం లేదు.
అందువల్ల ఆంధ్రాలో రాజకీయ శూన్యత ఉన్నదన్నమాట. ప్రజల్లో నమ్మకం కలిగించే నాయకుడు ఎవరైనా అవతరించాల్సిన ఖాళీ, అవకాశం పుష్కలంగా ఉన్నాయట. మరి పవన్ కల్యాణ్ ఎలాగూ 2019 లో బరిలో దిగుతానంటున్నాడు. ఆయన సినిమాలు, గినిమాలు కట్టిపెట్టి.. సీరియస్ గా రంగంలో దిగితే ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. వాటిని పవన్ సరిగ్గా ఉపయోగించుకోగలడా.. లేదా అన్నది ఆయన సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

No comments:

Post a Comment