భారత్, మయన్మార్ సరిహద్దు
ప్రాంతంలో భారీ భూకంపం సంభవించడంతో దాని ప్రభావం పలు ప్రాంతాల్లో
కనిపించింది. మఖ్యంగా పొరుగుదేశాలైన ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, చైనా,
థాయిలాండ్ దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8
దాటితో సునామీ హెచ్చరికలు జారీ అవుతాయి. అయితే తాజాగా మాయన్మార్‌లో భూకంప
తీవ్రత 6.9గా నమోదు కావడంతో ఇదేమీ చిన్నపాటి భూకంపం కాదని విశ్లేషకులు
అంటున్నారు. కోల్‌కతాలో అయితే భవనాలు పాక్షికంగా బీటలు వారాయి. మయన్మార్‌కు
ఆనుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం బాగా పడింది.
మయన్మార్ సముద్రానికి ఆనుకుని ఉంది కాబట్టి ఈ ప్రభావం భూమి లేయర్లలో
కదలికలు ఏర్పడి సముద్రంలో కూడా అలజడి సంభవించే అవకాశముందని సమాచారం. అయితే ఈ
భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాల్లేవని భారత వాతావరణ శాఖతో పాటు,
అమెరికన్ న్యాచురల్ డిజాస్టర్ డిపార్ట్‌మెంట్ కూడా పక్రటించాయి.


No comments:
Post a Comment