వాట్సప్ యూజర్లు
రోజురోజుకూ పెరుగుతున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూజర్ల
సంఖ్యకు అనుగుణంగా వాట్సప్ యాజమాన్యం కూడా ఉద్యోగులను రిక్రూట్
చేసు కుంటుందనుకుంటున్నారా..? అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా
వాట్సప్‌కు 45కోట్ల మంది యూజర్లు ఉన్నారు. రోజుకు 2700 కోట్ల మెసేజ్‌లు
వాట్సప్ ద్వారా యూజర్లు ఒకరికి ఒకరు పంపుకుంటున్నారు. అంత భారీ మొత్తంలో
యూజర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కేవలం 32మంది మాత్రమే
ఇంజనీర్లు ఉన్నారంటే నమ్మగలరా..? ఇది నిజమే. కంపెనీలో మొత్తం ఉద్యోగులు
50మంది అయితే వారిలో 32 మంది మాత్రమే వాట్సప్‌కు టెక్నికల్ ఇంజనీర్లు. ఈ
లెక్కన ఒక్కో ఇంజనీర్ ఒక కోటి 40 లక్షల యాక్టివ్ యూజర్ల సర్వీసుకు బాధ్యత
వహిస్తున్నట్లు లెక్క. ఇదండీ వాట్సప్ ఇంజనీర్ల శ్రమ...

No comments:
Post a Comment