లండన్: మంట
పుట్టించే వేసవిలో చల్లటి బీర్‌లతో ఎంజాయ్ చేద్దామనుకుంటారు చాలామంది.
వారికి ఇది కొంచెం చేదు వార్తే. ఎందుకంటే ఇతర కాలాలతో పోల్చుకుంటే వేసవిలో
బీర్‌లు తాగడం ఆరోగ్యానికి హానికరమట. మండే ఎండల్లో కూల్ కూల్ బీర్
తాగితే ఉపశమనం లభిస్తుందన్న మాట ఒట్టి అపోహేనట.
బీర్‌తోపాటు
ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఏ ఇతర పానీయమైనా శరీరంలోని నీటి
శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. ఆల్కహాల్ తాగినవారెవరైనా తరచూ మూత్ర
విసర్జన చేస్తుంటారు. శరీరంలోని రక్తంలో కలవని ఆల్కహాల్ ఇలా మూత్రం ద్వారా
బయటకు పోతుంది. అయితే అలా బయటకు పోతూ అధిక శాతంలో నీటిని కూడా బయటకు
తీసుకుపోతుంది.
నీటితోపాటే
పొటాషియం, సోడియం వంటి లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. వేసవి కాబట్టి
చెమట ద్వారా కూడా నీరు బయటకు పోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ ఏర్పడే
ప్రమాదం ఉందట. అందువల్ల వేసవిలో బీర్‌లకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదట.

No comments:
Post a Comment