Monday, 4 April 2016

లిఫ్టు వాడకపోతే మెదడు ఆరోగ్యంగా ఉంటుందట!

లిఫ్టు ఉపయోగించడం కన్నా మెట్లు ఎక్కి దిగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పదే పదే చెబుతుంటారు. ఈప్రక్రియ శరీరానికే కాదు మెదడుకు కూడా ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని ఇస్తుందని కెనడా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. పదిహేడు సంవత్సరాల నుంచి డెబ్భైతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గల 300 మంది వ్యక్తుల మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. వయస్సు రీత్యా జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచించలేకపోవడం వంటి సమస్యలను మెట్లు ఎక్కడం ద్వారా అధిగమించవచ్చని వీరు అంటున్నారు. వయస్సు రీత్యా మెదడులో సంభవించే పలు పరిణామాలకు కూడా ఈ వ్యాయామం చెక్‌ పెడుతుందని అంటున్నారు. అయితే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment