కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
నందమూరి తారకరామారావు తెలుగు
దేశం పార్టీని స్థాపిస్తే..
ఇవాళ తెలుగుదేశం నేతలు కాంగ్రెస్‌తో
జత కట్టడం శోచనీయమని తెలంగాణ
రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు.
తెలుగుదేశం నేతల తీరుతో ఎన్టీఆర్
ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఖమ్మం
జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప
ఎన్నికకు తుమ్మల నాగేశ్వరరావు
నామినేషన్ వేయనున్న సందర్భంగా
నాయుడుపేటలోని పెద్ది ఎల్లారెడ్డి
ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన
కార్యకర్తల సమావేశానికి మంత్రి
కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ... అసాధారణమైన
పరిస్థితుల్లో పాలేరు ఉప ఎన్నిక
వచ్చింది.. తుమ్మల నాగేశ్వరరావును
భారీ మెజార్టీతో గెలిపించాలని
కోరారు. సమావేశంలో మంత్రి తుమ్మల
నాగేశ్వరరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి, పలువురు తెరాస
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ర్యాలీగా వెళ్లి
తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్
వేయనున్నారు.

No comments:
Post a Comment