స్కానింగ్‌లో జీర్ణాశయంలో అది కనిపించగానే వైద్యుల నోట మాట రాలేదు !
చిన్నప్పుడు
ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటుంది. అది చెడ్డ అలవాటు కావచ్చు. మంచి అలవాటు
కావచ్చు. మంచి అలవాటైతే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అదే చెడు అలవాటైతే
మానుకోమని హితవు పలుకుతారు. అదే వింత అలవాటుంటే. ఆ తల్లిదండ్రులు నరకయాతన
అనుభవిస్తారు. సరిగ్గా అలాంటి వింత పరిస్థితే ఓ యువతికి ఎదురైంది. పుణెలోని
ఓ 17 ఏళ్ల యువతి గత శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది.
కడుపునొప్పికి కారణమేంటా అని స్కానింగ్ చేసిన వైద్యులకు నోట మాట రాలేదు.
ఆమె జీర్ణాశయంలో దాదాపు కేజీ వెంట్రుకలు ఉండటం చూసి వైద్యులు కంగుతిన్నారు.
అసలు విషయమేంటంటే ఆ యువతి 5 సంవత్సరాలుగా టీవీ చూస్తూ జుట్టును అన్నంలా
లాగించేసింది. అలా తినితినీ కొన్నాళ్లకు అన్నంపై ఆమెకు మొహం మొట్టింది.

No comments:
Post a Comment