లూథియానా : హీరో సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు సత్యానంద ముంజాల్(99) కన్ను మూశారు. పంజాబ్ రాష్ట్రం లూథియానాలో మోడల్ టౌన్‌లో గురువారం ఆయన కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మహాత్మ’గా ఆయన అందరికీ సుపరిచితులు. ముంజాల్ బ్రదర్స్‌లో పెద్దవారు. ఆయనకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. భారత్‌లో ప్రముఖ సైకిళ్ల సంస్థ అయిన ‘హీరో’ను స్థాపించి దాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఉప ముఖ్య మంత్రి సుఖబీర్ సింగ్ బాదల్, రెవిన్యూ మంత్రి బిక్రమ్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు.
Thursday, 14 April 2016

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment