హనుమాన్
జయంతికి పటిష్ట భద్రత
హైదరాబాద్:
రేపు జరగబోయే హనుమాన్ జయంతి
ర్యాలీకి పటిష్ట పోలీసు భద్రత
ఏర్పాటు చేసినట్లు తెలంగాణ
రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
తెలిపారు. పోలీసుల భద్రత ఎంత
ఉన్నా.. ప్రజలందరూ సహకరించి
హనుమాన్ ర్యాలీని సజావుగా
నిర్వహించుకోవాలని కోరారు.
సికింద్రాబాద్ మహీంద్రాహిల్స్‌లోని
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
చేసిన ఆయన హనుమాన్ ఆలయం ముందు
ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో
పాల్గొన్నారు. అంతకు ముందు సాయిబాబా
ఆలయం నిర్వాహకులు హోం మంత్రికి
ఘన స్వాగతం పలికారు.
హనుమాన్
శోభాయాత్రకు భారీ బందోబస్తు
రేపు హైదరాబాద్‌లో నిర్వహించే హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు
ఏర్పాటు చేసినట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గత అనుభవాలను
దృష్టిలో పెట్టుకుని తగిన వ్యూహాలను రచించినట్లు పేర్కొన్నారు. సెంట్రల్ జోన్
పరిధిలో నారాయణగూ, చిక్కడపల్లి, ముషీరాబాద్, గాంధీనగర్, రాంగోపాల్‌పేట
పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు 8 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
వూరేగింపు దారిలో 25 ప్రార్థనా మందిరాలు ఉన్నాయని... వాటికి పూర్తిస్థాయిలో
భద్రత కల్పిస్తామన్నారు. 1500 మంది పోలీసులతో పాటు అదనపు బలగాలతో
బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment