కొత్త రేషన్‌కార్డు (ఆహార భద్రత కార్డు)కు మీరు అర్హులా? ఐతే నేరుగా మీ
సేవకు వెళ్లి దరఖాస్తు చేస్తే చాలు నిర్ణీత 30 తర్వాత రేషన్ సరుకులు
తీసుకోవచ్చు. మధ్యవ్యక్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ప్రభుత్వం
పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. గతంలో సంబంధిత సివిల్‌సైప్లె (ఏఎస్‌వో)
కార్యాలయంలో వెళ్లి దరఖాస్తు పట్టుకుని కాళ్లు అరిగేలా తిరగడం, చివరికి
పైసో పరుకో పెట్టి రేషన్‌కార్డును పొందేవారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ
ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా అర్హులైన
లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించే క్రమంలో లబ్ధిదారుల ఎంపికను ఆన్‌లైన్
చేశారు.
రేషన్‌కార్డు (ఆహారభద్రత) కావాలనుకునే వారంతా తెల్లకాగితంపై వివరాలను రాసి, ఆధార్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌తో స్థానిక మీసేవలో రూ.35 కట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నప్పటీ నుంచి 30 రోజుల్లోగా క్షేత్రస్థాయిలో ఏఎస్‌వో దరఖాస్తుదారులు అర్హులా? అనర్హులా ? నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ క్రమంలోనే అర్హులైన వారి వివరాలను సంబంధిత చౌక ధరల దుకాణానికి అందజేసీ ఈ-పాస్ మిషన్‌లో పొందుపర్చుతారు. ఆ మరుసటి మొదటి వారం నుంచి ఎప్పుడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.
మార్పులు చేర్పులు కూడా మీ సేవాలోనే...
పొట్ట చేతపట్టుకుని వలసవచ్చి ఆయాచోట్ల స్థిరపడిన వారంతా ఎక్కువగా ఒక చోట ఉండరు. వారీవారీ ఆర్థిక, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో ఇంటి అద్దెలను ఒక చోటి నుంచి మరోచోటికి మార్చుతారు. ఐతే ఇలా ఇళ్లు మారిన సమయంలో రేషన్‌కార్డును స్థానిక చౌక దరల దుకాణానికి మార్చుకోవడం కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలోనే ప్రహసనంగా మారిన రేషన్‌కార్డుల బదిలీని సులభతరం చేశారు.
తెల్లకాగితంపై స్వయంగా రాసి, దానికి కొత్తగా మారిన ఇంటి కరెంట్ బిల్లును జోడించి మీ సేవాలో రూ.35లు చెల్లిస్తే చాలు ఈ ప్రక్రియను 30 రోజుల్లోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు. లబ్ధిదారులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

No comments:
Post a Comment