గుండపోటు.. హఠాత్తుగా
దాడి చేసి ప్రాణాన్ని కబలించేసే వ్యాధి. దీన్ని ముందుగా గుర్తించడానికి
చిన్న చిన్న సంకేతాలు ఉన్నాయి కానీ.. అవేవీ నిర్దుష్టమైనవి కావు. అయితే
గుండెపోటును కచ్చితంగా ముందుగానే తెలుసుకోవాలంటే ఓ చిన్న చిట్కా ఉందట.
ఎప్పుడో
రాబోయే గుండెపోటు గురించి ముందుగా తెలుసుకోవాలంటే రెండు చేతులలోని
రక్తపోటును కొలవాలని స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ పరిశోధకులు
వెల్లడించారు. ఎడమ చేతికి, కుడి చేతికి బీపీ చెక్ చేయించుకోవాలని, అలా
చేయించుకున్నప్పుడు రెండు చేతుల రీడింగ్‌లో తేడా ఐదు పాయింట్ల కంటే
ఎక్కువగా ఉన్నట్టైతే సదరు వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు
పెరుగుతుందని వారు తెలిపారు. దీని నిర్దారణ కోసం దాదాపు మూడు వేల మందిపై
ఎనిమిదేళ్లపాటు పరిశోధన సాగించారు. అప్పుడే ఈ ఆశ్చర్యకరమైన విషయం
తెలిసిందన్నారు. అందుకే అందరూ బీపీ పరీక్షలు చేయించుకునేటపుడు ఇకపై ఈ
పరీక్ష చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు.

No comments:
Post a Comment