Friday, 8 April 2016

శ్రీదుర్ముఖి నామ సంవత్సర రాశిఫలాలు...

 మేష రాశి

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 7


దుర్ముఖి నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆర్థిక విషయాలు, వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తికి, ప్రమోషన్లకు, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే మాసాల్లో ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికం. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో నిరుత్సాహపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. స్థిరాస్తులు పెంపొందించుకుంటారు.

5-6 స్థానాల్లో గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విద్య, వైజ్ఞానిక రంగాలలో విశేష ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్హతలు, నైపుణ్యానికి తగిన సదవకాశాలు లభిస్తాయి. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. గురువు వక్రగమనంలో ఉన్న ఉగాది నుంచి రెండు మాసాల పాటు గురువు వక్రించినందున పెట్టుబడుల్లో నిదానం అవసరం. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. విదేశీ గమనానికి ఆటంకాలు ఎదురవుతాయి. పొదుపు పథకాల్లో నష్టం సంభవం. ఆగస్టు 12 నుంచి గురువు కన్యారాశిలో సంచరిస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. అయితే అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. అనారోగ్యం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, అనవసర వ్యయం ఉంటాయి. అపనిందలు మోయాల్సి వస్తుంది.

దుర్ముఖి నామ సంవత్సరంలో 2016 జనవరి 24 వరకు వృశ్చికంలో, ఆ తరువాత ధనుస్సులో శనిసంచారం జరుగుతుంది. ఫలితంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. రుణబాధలు అధికం. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాల్సిన అసవరం ఉంది. ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక అశాంతి బాధిస్తుంది. నిధుల విషయంలో మాటపడాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పనిచేసే వారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో అపనిందలు ఎదుర్కొంటారు. బంధుమిత్రుల వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. శని వక్రగమనంలో ఉన్న 2016 ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి. కానుకలు, బహుమతులు అందుకుంటారు.

5-11 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ప్రేమవ్యవహారాలు, స్నేహాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు అశ్రద్ధ కార ణంగా నష్టపోతారు. ఆర్థిక ఇబ్బందుల అధికంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఇది తగిన సమయం కాదు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసాలకు వెచ్చిస్తారు.

శివారాధన వల్ల ఈ ఏడాది సత్ఫలితాలు సాధిస్తారు.

 వృషభరాశి
వృషభం (కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం: 11 వ్యయం: 14
రాజపూజ్యం: 4 అవమానం: 7

ఈ ఏడాది గురు, శని, రాహుకేతువుల సంచారం ఆధారంగా వృషభరాశి వారు స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ గమనం, ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహనయోగం కలుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఉగాది నుంచి రెండు మాసాల పాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి.

ఈ ఏడాది 4, 5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచరిస్తున్నాడు. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణం, గృహప్రవేశానికి అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభప్రదం. పరిచయాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లకు అనుకూలం. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ - మే మాసాల్లో రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

జనవరి 24, 2017 వరకు శని మీ 7వ స్థానంలో ఆ తరువాత 8వ స్థానంలో సంచారం చేస్తాడు. మొదట కొన్ని ఆటంకాలు ఎదురయినా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానంతరం జీవిత భాగస్వామి వల్ల కలిసివస్తుంది. ప్రత్యర్థుల కదలికలపై ఒక కన్నేసి ఉంచండి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సకాలంలో డబ్బు చేతికి అందక ఇబ్బందిపడతారు. దాంతపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య వరకు ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. బకాయిలు వసూలవుతాయి. దాంపత్యం సంతోషదాయకంగా సాగుతుంది. దూర ప్రయాణాల్లో సమస్యలు తలెత్తే అవకాశం వుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

ఈ ఏడాది 4-10 స్థానాల్లో రాహుకేతువుల సంచారం జరుగుతుంది. ఫలితంగా ఇల్లు, స్థలం క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం మందగించే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాక నిరాశపడతారు. చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల సత్ఫలితాలు సాధిస్తారు...

మిథునరాశి
మిథునం (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 14 వ్యయం: 11
రాజపూజ్యం: 7 అవమానం: 7


ఈ ఏడాది మిథునరాశి వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం వుంది. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సలె ్టన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో
శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకుంటారు. ఏప్రిల్‌, మే మాసాల్లో గురువు వక్రించిన కారణంగా విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాలకు చెందిన వారు జాగ్రత్త పాటించాలి.

ఈ ఏడాది గురు గ్రహం ఆగస్టు 10 వరకు సింహంలో ఆ తరువాత కన్యారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా దూరప్రయా ణాలకు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడ తాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభ వం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉగాది నుంచి రెండు మాసాల పాటు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.

ఈ ఏడాది 6, 7 స్థానాల్లో శని సంచారం కారణంగా వృత్తి, వ్యాపారాల్లో అతనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పని ఒత్తిడి అధికం. పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శక్తికి మించి కష్టపడతారు. కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్త అవసరం. ఉదరసంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భారీ వ్యాపారాలు వాయిదా వేయండి. శ్రీవారు, శ్రీమతి విషయంలో ఏదో వెలితి బాధిస్తుంది. శని వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య వృత్తి, వ్యాపా రాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి శుభప్రదం. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం.

3-9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల అన్న దమ్ముల మధ్య అపోహలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నష్టం సంభవం. అనుకోకుండా దూరప్రాంతాలకు బదిలీ అవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉన్నత విద్య, విదేశీ యానాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. పెట్టుబడుల్లో తొందర తగదు. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పుంజుకుంటుంది.

దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు సాధిస్తారు...
 

 మిథునరాశి
మిథునం (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 14 వ్యయం: 11
రాజపూజ్యం: 7 అవమానం: 7


ఈ ఏడాది మిథునరాశి వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం వుంది. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సలె ్టన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో
శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకుంటారు. ఏప్రిల్‌, మే మాసాల్లో గురువు వక్రించిన కారణంగా విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాలకు చెందిన వారు జాగ్రత్త పాటించాలి.

ఈ ఏడాది గురు గ్రహం ఆగస్టు 10 వరకు సింహంలో ఆ తరువాత కన్యారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా దూరప్రయా ణాలకు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడ తాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభ వం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉగాది నుంచి రెండు మాసాల పాటు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.

ఈ ఏడాది 6, 7 స్థానాల్లో శని సంచారం కారణంగా వృత్తి, వ్యాపారాల్లో అతనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పని ఒత్తిడి అధికం. పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శక్తికి మించి కష్టపడతారు. కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్త అవసరం. ఉదరసంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భారీ వ్యాపారాలు వాయిదా వేయండి. శ్రీవారు, శ్రీమతి విషయంలో ఏదో వెలితి బాధిస్తుంది. శని వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య వృత్తి, వ్యాపా రాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి శుభప్రదం. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం.

3-9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల అన్న దమ్ముల మధ్య అపోహలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నష్టం సంభవం. అనుకోకుండా దూరప్రాంతాలకు బదిలీ అవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉన్నత విద్య, విదేశీ యానాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. పెట్టుబడుల్లో తొందర తగదు. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పుంజుకుంటుంది.

దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు సాధిస్తారు
...


కర్కాటక రాశి
కర్కాటకం (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం: 8 వ్యయం: 11
రాజపూజ్యం: 3 అవమానం: 3


గురు, శని, రాహుకేతువులు సంచారం ఆధారంగా కర్కాటక రాశి వారికి దుర్ముఖినామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్‌పై వేరే ప్రాంతాలకు బదిలీ అవుతారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులు పట్టుద లతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏప్రిల్‌ - మే మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది.

2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. దానధర్మాలకు, ఆధ్యాత్మిక విషయాలకు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు సాధిస్తారు. నలుగురి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఆగస్టు 11 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

5, 6 స్థానాల్లో శని సంచారం కారణంగా విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. శ్రద్ధలోపించడం వల్ల లక్ష్య సాధన కష్టం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం వుంది. అపవాదులు ఎదుర్కొంటారు. పనులు పూర్తికాకపోవడం వల్ల చికాకులు అధికం అవుతాయి. విలాసాలకు ఖర్చులు అధికం. జనవరి నుంచి ఆరోగ్యం పట్ల శ్రధ్ద చూపించాలి. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య ఉన్నత విద్యా విషయా లకు అనుకూలం. స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. స్థిరచరాస్తి విషయాల్లో చికాకులు తలెత్తు తాయి. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు.

2-8 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు ఎవరికైనా ఇస్తే సకాలంలో తిరిగి చేతికి రాదు. బాకీలు సకాలంలో చెల్లించలేక మాటపడాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఆస్తి విషయాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి పరమైన ఒత్తిళ్లు అధికం. వ్యాపారం మందకొడిగా సాగు తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి.

దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల కష్టాలు తొలగి, శుభఫలితాలు సాధిస్తారు....

 సింహ రాశి
  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ఆదాయం: 11 వ్యయం: 5

రాజపూజ్యం: 6 అవమానం: 3


సింహ రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యక్తి గత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహ కరం. గురువు వక్రించిన ఏప్రిల్‌, మే మాసాల్లో అశాంతికి లోనవుతారు. అలర్జీలు బాధిస్తాయి.


గురువు 2016 ఆగస్టు 10 వరకు మీ జన్మరాశిలోనూ ఆ తరువాత కన్యా రాశిలోనూ సంచరిస్తున్నది. ఫలితంగా గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. చక్కని ఆలోచనలు స్ఫురిస్తాయి. నూతన పథకాలకు కార్యరూపం ఇవ్వగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే మాసాల్లో స్నేహబాంధవ్యాల్లో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. విద్యార్థులు లక్ష్యసాధనకు అధికంగా శ్రద్ధ చూపాలి.
శని 4,5 స్థానాల్లో సంచారం ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారికి శుభప్రదం. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. 2017 జనవరి నుంచి విదార్థులు శ్రద్ధాలోపం కారణంగా నష్టపోతారు. శని వక్రగమనంలో ఉన్న మార్చి - ఆగస్టు మాసాల మధ్య పెద్దలు అనారోగ్యం పాలవుతారు. కుటుంబంలో కలతలు ఎదురవుతాయి. భూ క్రయవిక్రయాల్లో అన్ని విషయాలూ సరిచూసుకుని అగ్రిమెంట్లు కుదుర్చు కోవాలి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం అవుతాయి.

1-7 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల అశ్రద్ధ కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతములతో ఎడబాటు తప్పకపోవచ్చు. భాగస్వాములతో కలహాలు, మనస్పర్థలు అధికం. స్పెక్యు లేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి. చిన్నమొత్తాల్లో పెట్టిన పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు వస్తాయి.

శ్రీరామచంద్రుడి ఆరాధన శుభప్రదం...

 కన్య రాశి
కన్య (ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు)

ఆదాయం: 14 వ్యయం: 11
రాజపూజ్యం: 2 అవమానం: 6


కన్య రాశి వారు ఈ ఏడాది ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగంలో భాగంగా విదేశీ యానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ గమనం, ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఏప్రిల్‌, మే మాసాల మధ్య ఉద్యోగ, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తేనే సత్ఫలితాలు సాధించగలరు.

ఈ ఏడాది 12-1 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు అధికం. ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఇల్లు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికవిషయాల్లో నిదానంగా కానీ పనులు జరగవు. ఆరోగ ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉగాది నుంచి నెల రోజుల వరకు పొరుగు రాషా్ట్రలు, విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల మూలంగా ఆదాయం లభిస్తుంది. మీ లక్ష్యసాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. నూతన పథకాలకు కార్యరూపం ఇవ్వగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం.
ఈ ఏడాది శని 3, 4 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా సోదరీసోదరుల వ్యవహారాలు చికాకు కలిగిస్తుంది. మార్కెటింగ్‌, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ, బోధనా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబపరమైన గొడవలు తలెత్తుతాయి. చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. జనవరి తరువాత ఇల్లు మరమ్మత్తు పనులకు ఖర్చులు అధికం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు శని వక్రగమనంలో ఉన్నందున విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి చదువుల్లో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తుంది.

12-6 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో కృషి చేస్తే సత్ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవ హరించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు తగిన సమయం కాదు. మనశ్శాంతి లోపిస్తుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. ఉదరసంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం...

 తులా రాశి
తుల (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం: 11 వ్యయం: 14
రాజపూజ్యం: 5 అవమానం: 6


తులా రాశి వారికి ఈ ఏడాది వ్యాపారాభివృద్ధికి అనుకూలం. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. ఏప్రిల్‌ - మే మాసాల్లో ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అనవసరమైన ఖర్చులు అధికం. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది.

గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉగాది నుంచి నెల రోజుల కాలంలో పెద్దవారి ఆరోగ్యం మందగిస్తుంది. స్నేహానుబంధాలు బెడిసి కొట్టే అవకాశం వుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి.

దుర్ముఖి నామ సంవత్సరంలో 2, 3 స్థానాల్లో శని సంచారం వల్ల పెట్టుబడుల్లో తొందరపాటు కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వేరేవారి ఆర్థిక విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు.ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తుతాయి. సౌకర్యలేమితో ఇబ్బంది పడతారు. రుణబాధలు అధికం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. దీర్ఘకాలిక దృష్టితో చేసే పెట్టుబడులు కొంతవరకు లాభిస్తాయి. జనవరి నుంచి విద్యార్థులు శ్రద్ధాలోపం కారణంగా నష్టపోతారు. సోదరీసోదరుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. ఏప్రిల్‌ 8 నుంచి ఆగస్టు వరకు సినీ రాజకీయ రంగాల వారికి శుభప్రదం. ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు కొంత ఆశా జనకంగా ఉంటాయి. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి.

11-5 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల విద్యార్థులకు చదువులపై అశ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. అపోహల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. రుణబాధలు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు, కుటుంబపరమైన ఒత్తిళ్ల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్థిక స్థిరత్వం లోపిస్తుంది. విలాసాలు, ప్రయాణాలకు ఖర్చులు అధికం. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి.

పార్వతీ దేవి ఆరాధన వల్ల చిక్కులుతొలగి శుభాలు కలుగుతాయి...


వృశ్చికరాశి
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 2


వృశ్చికరాశిలో పుట్టినవారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభి వృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయ త్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఏప్రిల్‌ - మే మాసాల్లో మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. రుణబాధలు ఎక్కువ అవుతాయి. స్థలమార్పిడి అవకాశాలు అధికం.
పురోగతినిచ్చే గురువు ఈ ఏడాది మీ 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడిగలవారు, ఉన్నత పదవులలో ఉన్నవారు వృత్తి, ఉద్యోగాలలో సహకరిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ - మే మాసాల మధ్య బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటు నిర్ణయాలు తగవు.

ఈ సంవత్సరం మీ జన్మరాశి వృశ్చికం, 2 స్థానానమైన ధనుస్సుల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా 2017 జనవరి వరకు పోలీసు, రక్షణ రంగాల వారికి ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. అపనిందలు ఎదుర్కొంటారు. ఉగాది నుంచి ఆగస్టు 3 వరకు శని వక్రించి ఉన్న కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి.

10-4 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. పై అధికారులతో మనస్పర్థల కారణంగా నష్టపోతారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే వారు అశాంతికి గురవుతారు. మహిళలు సమస్యలు ఎదుర్కొంటారు.

ఆంజనేయస్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది...
 

ధనుస్సు రాశి
దనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం: 5 వ్యయం: 14
రాజపూజ్యం: 4 అవమానం: 2


ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే ధనుస్సు రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌, మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. విద్యావిషయాలు, న్యాయ పోరాటాలలో విజయం సాధిస్తారు. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉగాది నుంచి నెల రోజుల పాటు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి.

12, 1వ స్థానాల్లో ఈ సంవత్సరం శని సంచారం జరుగుతుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు. పైచదువుల కోసం చేసే ప్రయత్నాలకు అటంకాలు ఎదురవుతాయి. రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. 2017 జనవరి నుంచి మానసికంగా చికాకుగా ఉంటుంది. ఆటంకాలు, అవరోధాల కారణంగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే చందంగా ఉంటుంది. ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య శని వక్రగమనంలో ఉన్నాడు. ఆ సమయంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
9-3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఏజెన్సీలు, స్టేషనరీ, ట్రావెల్‌ రంగాల వారికి ఒత్తిడి అధికం. సన్నిహితుల మధ్య అపోహలు పెరుగుతాయి. విద్యా ర్థులకు చదువుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మోసపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాలకు బదిలీ అవుతారు. కుటుంబ వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది.

శ్రీ లలితాదేవి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది...
 

 మకరరాశి
మకరం (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 7 అవమానం: 2


ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే మకరరాశి వారు వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అను కూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వుండే ఏప్రిల్‌ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

8-9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. న్యాయపరమైన సమస్యలు ఆగస్టు తరువాత పరిష్కారం అవుతాయి. ఏప్రిల్‌ - మే మాసాల మధ్య స్థిరచరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు సంభవం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్న వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగం లోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి.

ఈ ఏడాది 11, 12 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల కారణంగా అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల్లో నష్టం సంభవం. క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఒత్తిడులు కూడా అధికమౌతాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఆలస్యాలు, ఆటంకాలు, వైఫల్యాల వల్ల అసంతృప్తి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. మార్చి-ఆగస్టు మాసాల మధ్య శని వక్రించిన కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం.

8-2 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆరో గ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక సహాయం చేసే విషయంలో ముందు వెనుకలు ఆలోచించండి. చదువుల్లో ఆశ్రద్ధ కార ణంగా వైఫల్యాలు ఎదురవుతాయి. మంచి మనసుతో పక్క వారికి సాయం చేసి చిక్కుల్లో పడతారు.

గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన వల్ల దైవకృప లభించి, విజయం సాధిస్తారు..


 కుంభరాశి
కుంభం (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 3 అవమానం: 5

ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే కుంభరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యా ర్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహ కారంతో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వుండే ఏప్రిల్‌ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

ఆగస్టు 10 వరకు 7వ స్థానంలో గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు శుభ ప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. సంతానం లేని వారికి ఈ ఏడాది శుభప్రదం. ఆస్తులు పెంపొందించుకుంటారు. రాజకీయాలు, ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహ కరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆగస్టు 11 నుంచి సంవత్స రాంతం వరకు విధి నిర్వహణలో ఒత్తిళ్లు అధికమౌతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. పూర్వానుభవంతో, యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ఈ సంవత్సరం 10, 11 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వృత్తి, వ్యాపారాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు ఆస్కారం ఉంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చే పట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. జనవరి నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు. గుర్తింపు కోసం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాలు సాధిస్తారు.

7-1 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల భాగ స్వాములతో కలహాలు, మనస్పర్థలు అధికం. స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించు తాయి. అనుబంధాలు, ఆర్థిక విషయాల కారణంగా అశాంతికి లోనవుతారు. అశ్రద్ధ కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

దుర్గాదేవి ఆరాధన శుభఫలితాలనిస్తుంది...

 మీనరాశి
మీనం (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం: 5 వ్యయం: 14
రాజపూజ్యం: 6 అవమానం: 5


ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే మీనరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వుండే ఏప్రిల్‌ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

6-7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విలాసాలకు, మంచి పనులకు వెచ్చిస్తారు. పొరుగు రాషా్ట్రలు, విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యా లు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉగాది నుంచి నెల రోజుల పాటు ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. అనాలోచితంగా పక్కవారి సలహాలు పాటించడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈ ఏడాది 9, 10 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ రంగాల వారికి, టీచింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి శుభప్రదం. వృత్తిపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు చేపడతారు. శని వక్రించిన ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య న్యాయ, బోధన, కళా, రాజకీయ రంగంలోని వారు అనాలోచిత వైఖరి వల్ల ఇబ్బందులు పడతారు. ఆస్తిపాస్తుల విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అప్పు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో సమస్యలు ఎదురవుతాయి.

రాహు-కేతు గ్రహాల సంచారం ఫలితంగా శతృబాధ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో చికాకులు, ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదు రౌతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. వృత్తిపరంగా ప్రయోగాలకు ఈ ఏడాది అనుకూలం కాదు.

అన్నపూర్ణాదేవి ఆరాధన వల్ల శుభాలు లభిస్తాయి...
 

No comments:

Post a Comment