సినిమా హాళ్లలోనూ,
టీవీల్లోనూ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే స్లోగన్ నిత్యం
ప్రదర్శిస్తూనే ఉంటారు. అంతెందుకు సిగరెట్ ప్యాకెట్ల మీదే ఇది క్యాన్సర్
కారకం అని ముద్రిస్తారు. అయితే వీటిని పట్టించుకోకుండా ఎన్నో కోట్ల మంది
సిగరెట్లను కాల్చిపారేస్తున్నారు. అందుకే కొలంబస్‌కు చెందిన ఒహియో స్టేట్
పరిశోధకులు ఓ కొత్త రకమైన పథకం రచించారు.
కేవలం
నినాదాలు రాసి ఊరుకోవడం కంటే, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి
గ్రాఫిక్స్‌తో రూపొందించిన బొమ్మలను ముద్రిస్తే ఫలితం ఉంటుందని వారు రుజువు
చేశారు. ఇందుకోసం రోజుకు 10 నుంచి 40 సిగరెట్లు కాల్చేవారిని ఎంపిక చేసి
వారిలో కొందరికి రాతపూర్వక నినాదాలున్న సిగరెట్టు ప్యాకెట్లను అందించారు.
మరికొందరికి సిగరెట్టు ప్యాకెట్టు మీద ధూమపానం వల్ల కలిగే నష్టాల ను
వివరించే బొమ్మలను గురించి, సిగరెట్టు ఏ విధంగా ప్రమాదకరం అనే వివరాలు
ముద్రించి ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత ఫలితాలను పరిశీలించగా.. మొదటి
వర్గం కంటే రెండో వర్గం వారు సిగరెట్ల వాడకం తగ్గించారట. మరొకొంత మంది
సిగరెట్లను వదిలేయడానికీ సిద్ద్ధపడ్డారట. కేవలం రాతలతో కంటే సిగరెట్టు
అంటించే సమయంలో ఆ బొమ్మలు తమపై ప్రభావం చూపాయని చాలా మంది అంగీకరించారట.
దీన్ని బట్టి చూస్తే ప్రకటనల కోసం భారీగా డబ్బు వెచ్చించే బదులు సిగరెట్టు
ప్యాకింగ్ మార్చడం ఉత్తమమైన పద్ధతేమో.

No comments:
Post a Comment