సినీ ప్రపంచంలో బిగ్
బి.... ఈ పేరు సుపరిచితమే! కానీ ఆయన తిరిగే ఎయిర్ బస్ గురించీ కానీ, దాని
ఖరీదు గురించి కానీ పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఆయన ఎయిర్ బస్ ఖరీదు
అక్షరాలా 260 కోట్ల రూపాయలు అంటున్నారు. తను సొంతంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ
ఎయిర్ బస్‌లోనే ప్రయాణిస్తుంటారు. అంత ఖర్చుతో ఎయిర్ బస్ ఏర్పాటు
చేసుకోవడం ఏమిటి? అన్న అనుమానం సహజంగానే చాలా మందికి వచ్చింది. ఎందుకు
ఏర్పాటు చేసుకోకూడదని అంటున్నారు బిగ్ బి అభిమానులు. దశాబ్దాల తరబడి పేరు
ప్రఖ్యాతులు, బుల్లితెర ద్వారా, వెండితెర ద్వారా బోలెడంత ఆదాయం, కొడుకు
సూపర్ స్టార్ అయితే కోడలు స్టార్ హీరోయిన్. ఇక భార్య రాజకీయ నాయకురాలు.
ఇలా నలుగురూ ఎడతెగకుండా సంపాదిస్తుంటే ఎయిర్ బస్ కోసం ఆ మాత్రం ఖర్చు
పెట్టలేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సకల సదుపాయాలు కలిగిన ఆ ఎయిర్
బస్ ఫోటో ఇటీవల నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఇది.

No comments:
Post a Comment