Thursday, 21 April 2016

నోటి దుర్వాసన పొగొట్టే చిట్కాలు...

నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట మౌత్ వాష్ చేయడం మరిచిపోకూడదు. నోటిలో తేమ లేకుండే దుర్వాసన పెరిగిపోయే అవకాశం ఉంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. రోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ వుండాలని డెంటిస్టులు చెబుతున్నారు.


నోటి దుర్వాసన పొగొట్టే చిట్కాలు...
  1. లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
  2. వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి. అలాగే, పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
  3. నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
  4. లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూతతగ్గిపోతుంది.-గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూతఇట్టే తగ్గిపోతుంది.

No comments:

Post a Comment