Wednesday, 6 April 2016

ఎయిడ్స్‌కు విషంతో విరుగుడు


బ్రెజిలియన్‌ పాము నుంచి సేకరణ.. ఫలితాలపై ఐఐసీటీ నిర్ధారణ
  • రామంతాపూర్‌ హోమియో ఆసుపత్రిలో 3 వేల మందిపై ప్రయోగం
  • 10 మందికి నయం.. మిగతా వారిలో సిడి4 కౌంట్‌ పెరుగుదల
  • పూర్తి సమాచారానికి కేంద్రం ఆదేశాలు.. త్వరలో ఆమోదముద్ర
 
పరీక్షల్లో సత్ఫలితాలు.. ఐఐసీటీ నిర్ధారణ
రామంతపూర్‌ హోమియో ఆస్పత్రి లో ప్రయోగం
10 మందికి పూర్తిగా నయం
పూర్తి సమాచారం ఇవ్వండి: కేంద్రం
అధ్యయనానికి పుణె వైరాలజీ కేంద్రం ఆసక్తి 
 
 
 
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు శుభవార్త. హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌ బారిన పడి సతమతమవుతున్న వారికి కొత్త ఔషధం అందుబాటులోకి రాబోతోంది. ప్రాణాలు తీసే పాము విషమే.. ఆ ప్రాణాంతక వ్యాధికి మందు కానుంది! 3000 మందిపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షంచగా.. 10 మందిలో హెచ్‌ఐవీ వైరల్‌ లోడ్‌ సున్నాకు చేరింది! మిగతావారిలోనూ సీడీ-4 కౌంట్‌ పెరిగి, రోగ తీవ్రత తగ్గుముఖం పట్టింది!! అద్భుతమైన ఈ ప్రయోగం జరుగుతున్నది ఎక్కడో విదేశాల్లో కాదు..మన దేశంలోనే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరుగుతోంది! పాము విషంతో చేసిన ఈ ఔషధం బాగా పనిచేస్తోందని ఇండియన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థ కూడా ధ్రువీకరించింది.
ఇదీ నేపథ్యం..
రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్‌ విజృంభించినప్పుడు ఈ ప్రయోగానికి పునాది పడింది. రాష్ట్రంలోని ఆయుష్‌ విభాగం వద్ద బ్రెజిలియన జాతికి చెందిన ఒక రకం పాము విషంతో చేసిన ఒక ఔషధం ఉంది. కామెర్ల వంటి పలు రోగాల నియంత్రణకు ఆ ఔషధాన్ని చాలాకాలంగానే వినియోగిస్తున్నారు. ఈ ఔషధం ఎబోలా వైర్‌సకు పనిచేస్తుందా? లేదా? అనే విషయాన్ని పరీక్షించి చెప్పాల్సిందిగా ఐఐసీటీని ఆయుష్‌ అధికారులు కోరారు. అయితే ఎబోలా వైర్‌సకు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారం తమ వద్ద లేదంటూ.. దానికి దగ్గర పోలికలు ఉండే హెచఐవీపై ఈ ప్రయోగ పరీక్షలను నిర్వహించడానికి ఐఐసిటీ ముందుకు వచ్చింది. దాంతో ఆయుష్‌ సంస్థ పాము విషం ఔషధాన్ని పంపింది. ఐఐసీటీ ఆ మందుతో హెచ్‌ఐవీపై పరీక్షలు నిర్వహించింది. ఆశ్చర్యకరంగా.. అది ఆ వైర్‌సపై ప్రభావవంతంగా పనిచేస్తోందని పరీక్షల్లో తేలడంతో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా.. గత ఆరు నెలలుగా హైదరాబాద్‌ రామంతపూర్‌లోని హోమియో ఆసుపత్రిలో సుమారు 3 వేల మంది ఎయిడ్స్‌ బాధితులపై ఈ క్లినికల్‌ ట్రయల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం వారికి ఈ మందును అందిస్తున్నారు. ఈ ఔషధాన్ని తీసుకుంటున్న వారికి ప్రతీ వారం ఎయిడ్స్‌ పరీక్షలను జరిపి సీడీ-4 సెల్స్‌ కౌంట్‌ ఆధారంగా ఔషధం మోతాదును నిర్ధారిస్తున్నారు. డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్లినికల్‌ పరీక్షల్లో.. మందు వాడుతున్న వారిలో సీడీ-4 (రోగనిరోధక శక్తిని పెంచే) సెల్స్‌ కౌంట్‌ పెరుగుతున్నట్టు గుర్తించారు. అంతే కాదు.. వీరిలో సుమారు 10 మందిలో హెచ్‌ఐవీ వైరల్‌ లోడ్‌ జీరో అయినట్టు పరీక్షల్లో తేలింది. అంటే.. ఈ మందు వాడకం వల్ల వారిలో ఎయిడ్స్‌ పూర్తిగా నయమైనట్టు భావిస్తున్నారు. దీంతో, ఈ పరీక్షల ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ ఎయిడ్స్‌ నియంత్రణ బోర్డు కోరినట్టు ఆయూష్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. కాగా.. ఇదే విషయంపై పుణెలోని వైరాలజీ అధ్యయన కేంద్రం కూడా సంప్రదింపులు జరుపుతోంది.
రూపాయి లోపే!
ప్రస్తుతం ఎయిడ్స్‌ రోగులకు అందిస్తున్న ఈ ఔషధం ఖరీదు చాలా తక్కువ. ఎంత తక్కువంటే.. ఒక్కో డోస్‌ సుమారు 50 పైసల నుంచి ఒక్క రూపాయిలోపుగానే ఉంటోంది. దాంతో సామాన్య, పేద రోగులకు ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడనుంది.

No comments:

Post a Comment