Thursday, 7 April 2016

పోస్టుల భర్తీ...

టీఎస్‌పీఎస్సీ ద్వారా 2444 గురుకుల పోస్టుల భర్తీ...
  • సీఎం కేసీఆర్‌ ఆదేశం.. టీఎస్‌పీఎస్సీద్వారా నియామకాలు
  • సొసైటీల అధికారాలకు కత్తెర
 గురుకుల విద్యాలయాల సంస్థ అధికారాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్‌పెట్టింది. గురుకుల ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాలను
టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. ఈమేరకు వివిధ గురుకుల సంస్థల్లోని 2,444 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇప్పటిదాకా నియామకాలను ప్రత్యేక పరీక్ష ల ద్వారా నిర్వహించిన గురుకుల సంస్థలకు ముకుతాడు వేసినట్లయింది. నిబంధనల ప్రకారం పాలకమండలి అనుమతితో పోస్టుల భర్తీ జరుగుతుంది. గురుకులాల ఉపాధ్యాయ సర్వీస్‌ ని బంధనలు వేరుగా ఉంటాయి. గురుకుల సిబ్బంది ప్రతి విద్యార్థితో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. మొత్తంగా పిల్లల పట్ల ఒకరకంగా తల్లిదండ్రుల పాత్రనే పోషిస్తారు. ఈ బాధ్యతలకు అనుగుణంగానే నియామకాలు జ రుగుతాయి. మరోవైపు తాజా నిర్ణయించడంతో ఇప్పటిదాకా కాంట్రా క్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కష్టమొచ్చిపడింది. వీరిని ప్రత్యేక పరీక్ష ద్వారా గురుకులాలు నియమించుకున్నాయి. వీరి సేవలను ఇకముందూ పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ సంస్థల కింద 298 గురుకులాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి మైనారిటీల కోసం అదనంగా 70 గురుకులాలు రానున్నాయి.
తెలంగాణలో కొలువుల జాతర... 

  • వైద్య శాఖలో 2400 ఖాళీల భర్తీ
  • టీఎస్‌పీఎస్సీకి సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • గ్రామీణప్రాంత వైద్యులు సమీప పట్టణాల్లో ఉండే వెసులుబాటు
  • ప్రతి పీహెచ్‌సీలో కుక్క, పాము, తేలు కాటుకు ముందులు తప్పనిసరి
  • సమీక్షలో నిర్ణయం
           వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 2400 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ టీఎస్‌పీఎఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణిని ఆదేశించారు. క్యాంప్‌ ఆఫీసులో బుధవారం వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, కమిషనర్‌ బుద్ధ ప్రసాద్‌, డీఎంఈ రమణి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు రాహుల్‌ బొజ్జా, రఘునందనరావు, రోనాల్డ్‌ రోస్‌, కాళోజి హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌, ఉస్మానియా, గాంధీ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రజావైద్యాన్ని మెరుగుపరచడానికి బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించామని, ఆసుపత్రుల సూపరింటెండ్లకు అధికారాలు, నిధులు బదలాయించామని, వైద్యశాలల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, ప్రజావైద్యాన్ని మెరుగుపరిచే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. వైద్యశాఖలోని పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

సమీక్షలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు...
  • పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ ఆసుపత్రుల వరకు నిర్వహణనిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం సూపరింటెండెంట్లకు ఇవ్వాలి.
  • రోగులకు ఆసుపత్రుల్లోనే మందులు పంపిణీ చేయాలి. వీటి కొనుగోలు అధికారం కూడా సూపరింటెండెంట్లు, మెడికల్‌ అధికారులకే అప్పగించాలి. మందుల పంపిణీకి జిల్లాకు రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలి
  • హెచ్‌వోడీలకు ఏడాదికి రెండు కోట్ల రూపాయలు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు కోటి రూపాయల వరకు ఖర్చుచేసే అధికారం ఇచ్చినందున, జిల్లా పర్యటనకు వెళ్లే సమయంలో అత్యవసరం అనుకున్న పనులకు వెంటనే చేయాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో నివాసం ఉండే వెసులుబాటు కల్పించాలి. వారికి అదనపు నగదు ప్రొత్సాహం ఇవ్వాలి. ఆసుపత్రి నిర్వహణ కోసం హెల్త్‌మిషన్ ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలి. వాటితో పీహెచ్‌సీల నిర్వహణ బాధ్యతను మెడికల్‌ ఆఫీసర్లు నిర్వహించాలి.
  • పీహెచ్‌సీల్లో ఖచ్చితంగా కుక్కకాటు, పాముకాటు, తేలుకాటుకు మందు ఉండాలి.
  • పేదలకు రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఉచితంగానే జరగాలి. ఆసుపత్రుల్లో అవసరానికి తగ్గట్లుగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల స్థిరీకరణ, బలోపేతం, ఏకీకరణలపై దృష్టి పెట్టాలి.
  • రాష్ట్రంలో ఏడాదికి ఎంతమంది ఎంబీబీఎస్‌ చదివి బయటకు వస్తున్నారు? ఏ మేరకు అవసరం ఉంది? శాస్ర్తీయ అధ్యయనం చేయాలి.
  • వైద్య ఆరోగ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, కమిషనర్‌ బుద్ధప్రసాద్‌లు మరోసారి తమిళనాడుకు వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేయాలి.
  • టీచింగ్‌ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసే వెసులుబాటు ఇవ్వాలి.



No comments:

Post a Comment