Wednesday, 20 April 2016

డేంజర్ జోన్‌లో గూగుల్ యూజర్లు

గూగుల్ యూజర్లకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే వారు ఇప్పటికే వారికి తెలియకుండానే గూగుల్ వల్ల సమస్యలను ఎదుర్కొటున్నారు కాబట్లి. ఏంటీ నమ్మలేకున్నారా..? వెబ్‌సైట్ల క్వాలిటీని చెక్ చేసే ‘సేఫ్ బ్రౌజింగ్ స్టాటస్’లో గూగుల్ ఎంత సురక్షితమయినదో తెలిస్తే అవుననక తప్పదు. గూగుల్.కామ్ రక్షణ పరంగా పాక్షికంగా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు స్టేటస్ కనిపిస్తోంది. ఈ బ్రౌజర్లో కొన్ని వెబ్‌ పేజీలు మోసపూరితమైనవని తేల్చింది. వీటి ద్వారా గూగుల్.కామ్ బ్రౌజర్‌ను ఉపయోగించే కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి వైరస్ ప్రవేశిస్తోందనీ, కొన్ని సాఫ్ట్‌వేర్లు వాటంతట అవే డౌన్‌లోడ్ అవుతున్నాయని తేల్చింది. అంతేకాక మెయిల్స్, ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్, ముఖ్యమైన సమాచారం, క్రెడిట్ కార్డు వివరాలు చౌర్యానికి గురవుతున్నాయని సేఫ్ బ్రౌజింగ్ స్టాటస్ తేల్చి చెప్పింది. వీటితోపాటు కొన్ని సార్లు చూస్తున్న వెబ్‌సైట్స్.. ఉన్నట్లుండి వేరే పేజీలకు రీడైరెక్ట్ అవుతోంటే.. యూజర్లు ప్రమాదంలో ఉన్నట్లే అని చెబుతోంది. కొందరు హ్యాకర్లు గూగుల్.కామ్‌ను యూజర్ల వివరాలను చౌర్యం చేయడానికి ఉపయోగిస్తున్నారంటూ వివరించింది.

No comments:

Post a Comment