Monday, 18 April 2016

ఓ వ్యక్తితో లాడ్జికెళ్లి మద్యం సేవించి అత్యాచారానికి గురైన యువతి...

  • వివాహితపై అత్యాచారం?
  • ఐదు నెలల బాలిక అపహరణ
  • నిందితుడి అరెస్టు
       భర్తపై అలిగి చంటి బిడ్డతో కోయంబేడు బస్టాండు వద్ద సంచరిస్తున్న వివాహితను కిడ్నాప్‌ చేసుకెళ్లి లాడ్జిలో ఆమె పై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విరుగంబాక్కం పిళ్లయార్‌ కోవిల్‌ వీథిలో నివశిస్తున్న దంపతులకు ఐదునెలల కుమార్తె ఉంది. శనివారం భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్తపై అలిగిన ఆమె తన చేతిబిడ్డతో ఆంధ్రాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లేందుకు కోయంబేడు బస్టాండుకు చేరుకుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తాను సిటీ బస్సు డ్రైవర్‌ నంటూ నమ్మించి ఆమెను తిరువేర్కాడులో లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ మద్యం తాగారు. అదే అదనుగా ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం జరిపాడు.
 
ఆమె బిడ్డతో సహా పరారయ్యాడు. ఆదివారం వేకువజామున నిద్ర నుంచి లేచిన ఆ యువతి తన బిడ్డ కనిపించకపోవడం లాడ్జి సిబ్బందిని వద్ద తనతోపాటు వచ్చిన వ్యక్తి గురించి అడిగింది. ఆ వ్యక్తి ఎప్పుడో వెళ్లిపోయాడని వారు తెలుపటంతో ఆమె తిరువేర్కాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గూడువాంజేరి వద్ద చేతిబిడ్డతో సంచరిస్తున్న ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి మురుగానందం (40) అని సిటీ బస్సు కండెక్టర్‌గా పనిచేస్తూ సస్పెండ్‌ అయ్యాడని తెలుసుకున్నారు. వెంటనే ఆయనను పూందమల్లి కోర్టులో హాజరుపరచి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. మహిళను, ఆమె చంటిబిడ్డను చెంగల్పట్టు మహిళా సంరక్షణ కేంద్రానికి పంపారు.

 

No comments:

Post a Comment