మొబైల్
రంగంలో అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేయడంలో యాపిల్ ఐ ఫోన్ ఎప్పుడూ
ముందుంటుంది. అలాంటి ఐ ఫోన్ సాంకేతికతను అనుసరించడంలో మిగిలిన కంపెనీలు
కూడా అంతే ముందుంటాయి. దాదాపు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఐదు ఫీచర్లు ఐ ఫోన్
నుంచి కాపీ కొట్టినవేనని టెక్ పరిశోధకులు చెబుతున్నారు. అందులో మొదటిది
మెటల్ గ్లాస్ డిజైన్. ఇప్పుడొచ్చే ప్రతీ స్మార్ట్‌ఫోన్ దాదాపుగా మెటల్
గ్లాస్‌తో వస్తున్నదే. ఐ ఫోన్ 4 కోసం మొట్టమొదట ఈ మెటల్ డిజైన్‌ను
రూపొందించారు. ఆ తరువాత అన్ని కంపెనీలు ఈ డిజైన్‌నే అనుసరిస్తుండటం విశేషం.
మరో ఫీచర్ డ్యుయల్ ఫ్లాష్ కెమెరా.
ఐ ఫోన్ 5ఎస్
ద్వారా ఈ డ్యుయల్ ఫ్లాష్ కెమెరా పరిచయమైంది. ప్రస్తుతం ఈ డ్యుయల్ ఫ్లాష్
అనేది ఆండ్రాయిడ్ ఫోన్లలో కామన్ ఫీచర్‌గా మారింది. మోషన్ కో ప్రాసెసర్ కూడా
ఈ కోవలోకే వస్తుంది. బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేయడంలో ఈ ప్రాసెసర్ కీలక పాత్ర
పోషిస్తోంది. ఈ ఫీచర్‌ను కూడా కాలానుగుణంగా మార్చుకుని ఇతర కంపెనీలు
ప్రవేశపెట్టాయి. ఐఫోన్ 6ఎస్ ప్రవేశపెట్టిన మరో కొత్త ఫీచర్ 3డి టచ్. ఈ
ఆప్షన్‌ను కూడా తమ ఫోన్లలో ప్రవేశపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పుడొస్తున్న స్టైలిష్ ఎడ్జెస్ కూడా ఆపిల్ కంపెనీ
నుంచే వచ్చాయి. ఆపిల్ ఫోన్‌కు వన్నె తెచ్చి అందంగా కనిపించేలా చేసింది కూడా
ఈ స్టైలిష్ ఎడ్జెసే కారణం.

No comments:
Post a Comment