Wednesday, 20 April 2016

‘శక్తిమాన్’ కన్నుమూసింది

గత నెల ఉత్తరాఖండ్ లో  పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ గుర్రం శక్తిమాన్ కన్నుమూసింది.  బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఆ గుర్రం కాలుపై కొట్టి గాయపరచడంతో డెహ్రాడూన్ లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఆ గుర్రం కాలుకు ఆపరేషన్ కూడా చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చినట్లు వారు వెల్లడించారు. అయితే ఇన్ ఫెక్షన్ కారణంగా భరించలేని నొప్పితో శక్తిమాన్ కన్నుమూసినట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నిర్లక్షం వల్లే శక్తిమాన్ మృతి చెందిందని బీజేపీ విమర్శించింది.

No comments:

Post a Comment