వీకెండ్
వస్తే చాలు మాంసాహారానికి అలవాటయిపోయిన జీవితాలు చాలానే ఉన్నాయి.
వీకెండ్‌లో బిర్యానీ తినకుండా ఉండలేని వ్యక్తులు లెక్కకు మించి ఉన్నారు.
పుట్టిన రోజు వేడుకలయినా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ ముద్ద
లేనిదే నోటితోపాటు మనసు సంతృప్తి పడదనుకునే వారికి షాకింగ్ న్యూస్. తమకు
మద్యం తాగే అలవాటు లేదు.. కేవలం బిర్యానీ మాత్రమే ఇష్టంగా లాగించేస్తాం
అంతే అనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ
సమస్యలు అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయట.
బిర్యానీతోపాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత
ఎక్కువవుతాయట. ఈ విషయాలు ఓ పరిశోధనలో తెలిశాయి.
ఎటువంటి
మద్యం అలవాట్లు లేకున్నా ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో
బాధపడేవారి సంఖ్య ప్రతీ యేడాది 30 నుంచి 35 శాతం పెరుగుతోందట. నగరాల్లో
వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. వారం వారం క్రమం
తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం
ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి,
నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని
పరిశోధనలో తేలింది. బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి
దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని
ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క
బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు
మనిషికి ఒకే సారి అవసరం లేదని చెబుతున్నారు.

No comments:
Post a Comment