Saturday, 16 April 2016

20న ఇంటర్‌ ఫస్ట్‌ ఫలితాలు...

ఎండలతో జాగ్రత్త: గంటా 
                విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు మండుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పాఠశాల విద్యా శాఖ అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం ఆయన ఏయూలో విలేకరులతో మాట్లాడారు. ఎండతీవ్రత కారణంగా పాఠశాల విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలలను విడిచిపెడుతున్నారని.. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే విద్యార్థులను మధ్యాహ్నం 3 గంటల వరకు బళ్లోనే ఉంచాలన్నారు. కాగా.. ఇంటర్మీడియట్‌ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ముగిసిందని, ఈ నెల 20న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

No comments:

Post a Comment